Special Video from Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ.. గత మూడు వారాల నుంచి ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఈ పేరు చెప్పగానే సినీ ప్రియుల్లో తెలియని గూస్‌బంప్స్. అంతలా ఈ సినిమా అదరగొట్టింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ స్థాయిని పెంచాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలతో అందరిలోనూ టాలీవుడ్ అంటే ఓ రేంజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి’తో టాలీవుడ్ కీర్తి మరింత పెరిగింది. హాలీవుడ్ మాదిరి విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇది నిజంగా టాలీవుడ్ సినిమానా..? అనేంతగా దర్శకుడు రూపొందించాడు. అలాగే ఇందులో ప్రభాస్‌ను చూపించే తీరుకు సినీ ప్రియులు, అభిమానులు ఫిదా అయిపోయారు. హాలీవుడ్ మార్వెల్ మూవీస్ సూపర్ హీరోల మాదిరిగా సూట్‌లో కనిపించి అదరగొట్టేశాడు. మాస్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. కటౌట్‌కి తగ్గ రోల్‌లో ప్రభాస్ కనిపించి తమ అభిమానులను ఫిదా చేశాడు. ఇంతవరకు ప్రభాస్‌ను ఇలాంటి లుక్‌లో చూడలేదని.. ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రంసంశలు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా ఇందులో ఉండే కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్‌కి ఫ్యాన్స్ మంత్రముగ్దులయ్యారు. గాల్లో తేలే వాహనాలు, ఎలక్ట్రికల్ గన్స్.. ఇలా ప్రతీది చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసినంత సేపు వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపించిందని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. అంతేకాకుండా మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు. నిజంగా ఇలాంటి ఒక సినిమాను టాలీవుడ్ నుంచి అందించిన దర్శకుడు, నిర్మాతకు అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు.
Also Read: పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నారు మావా.. ఆ ఐకానిక్ షాట్స్ నెక్ట్స్ లెవెల్ అంతే
జూన్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సూపర్ డూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే టాక్ మెయింటైన్ చేస్తూ బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపేస్తుంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా దాదాపు 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ చేసి లాభాల భాటలో పరుగులు పెడుతుంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసిన కల్కి ఇప్పుడు రూ.1100 కోట్ల దిశగా పయణిస్తుంది.
అయితే ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సినిమా దుమ్ము దులిపే రెస్పాన్స్‌ను అందుకుంటుంది. ఈ వీకెండ్‌తో అక్కడ కల్కి రూ.250 కోట్ల మార్క్ క్రాస్ చేసేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే కల్కి రూ.1000 కోట్లు క్రాస్ చేయడంతో మూవీ మేకర్స్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఓ చిన్న వీడియోను కూడా వదిలారు. అందులో ప్రభాస్ ‘కర్ణ’ పాత్రలో ప్రకాశవంతమైన తేజస్సుతో కనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
The name is KARNA 🚩
Epic Maha Blockbuster #Kalki2898AD running successfully in cinemas near you!
– https://t.co/fUQMHgijPK#1000CroreKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/tBkuGwBzax
— Kalki 2898 AD (@Kalki2898AD) July 13, 2024
1000 CRORES and counting…💥
EPIC MAHA BLOCKBUSTER #Kalki2898AD running successfully…
Karnataka Grand Release by @KvnProductions #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/9ZSDP7cVTR
— KVN Productions (@KvnProductions) July 13, 2024