E-Paper
Advertisement

Prabhas Salaar: ‘సలార్’ టీజర్ డీకోడ్.. ఆసక్తికరమైన విషయాలు బయటికి..

Prabhas Salaar: ‘సలార్’ టీజర్ డీకోడ్.. ఆసక్తికరమైన విషయాలు బయటికి..
Advertisement

Prabhas Salaar: హీరోలకు ఎంత పాపులారిటీ ఉన్నా, ఫ్యాన్ బేస్ ఉన్నా.. సినిమాలో కంటెంట్ ఫ్యాన్స్‌కు నచ్చకపోతే అవి ఫ్లాప్ అవ్వక తప్పదు. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి అలాగే ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్.. ఫ్యాన్స్‌ను తృప్తిపరిచే సినిమాలు తీయలేకోపోయాడు. మళ్లీ పాత ప్రభాస్‌ను చూడాలని, తన నుండి ఒక మాస్ సినిమాను ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు ‘సలార్’ ఊరటగా అనిపిస్తోంది. ఇక తాజాగా విడుదలయిన సలార్ టీజర్‌లో ఫ్యాన్స్ డీకోడ్ చేసిన విషయాలు ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి.

‘బాహుబలి’ అనేది అప్పట్లో ఏ తెలుగు హీరోకు లేని స్టార్ స్టేటస్‌ను ప్రభాస్‌కు అందించింది. ఆ తర్వాత తన నుండి అలాంటి సినిమాను ఆశించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. కానీ ‘సాహో’ కోసం రెండేళ్లు కేటాయించిన తర్వాత అది కూడా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’.. మొదటి రోజుకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఎంతో హైప్‌తో విడుదయిన ‘ఆదిపురుష్’ కూడా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. దీంతో ప్రభాస్ కమ్ బ్యాక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘సలార్’తో ఆ కమ్ బ్యాక్ సాధ్యమని పూర్తిగా నమ్ముతున్నారు.

Advertisement

హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్‌ను కొట్టేవారే లేరు అని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అలాంటి దర్శకుడు ప్రభాస్‌కు ఎలాంటి ఎలివేషన్స్ ప్లాన్ చేశాడో చూడాలని ఎదరుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా సలార్ టీజర్ విడుదలయ్యింది. ఇందులో ప్రభాస్ ఫేస్ కనిపించకపోయినా.. మళ్లీ పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనున్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా ఈ టీజర్‌ను ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ డీకోడ్ కూడా చేశారు. దీన్ని పరీక్షగా చూస్తే.. సలార్‌కు, కేజీఎఫ్‌కు సంబంధం ఉన్నట్టు వారు భావిస్తున్నారు.

కేజీఎఫ్ సినిమా శాండిల్‌వుడ్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక కేజీఎఫ్ పార్ట్ 2లో రాకీ భాయ్ క్యారెక్టర్ మరణించినట్టుగా ప్రశాంత్ నీల్ చూపించాడు. కానీ సినిమా చివర్లో పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. అయితే రాకీ భాయ్ చనిపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ టీజర్‌లో లొకేషన్ చూస్తుంటే.. అచ్చం కేజీఎఫ్ 2 లొకేషన్ లాగానే అనిపిస్తోంది. పైగా లొకేషన్‌లో ఉన్న కోడ్స్ కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. దీంతో సలార్‌కు, రాకీ భాయ్‌కు కనెక్షన్ ఉండే విధంగా ఈ కథను ప్రశాంత్ నీల్ సిద్ధం చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీనికి నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని ప్రభాస్ ఫ్యాన్స్ పేరు కూడా పెట్టుకున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×