
Coco Lee: ఈరోజుల్లో డబ్బు, ఫేమ్, పలుకుబడి, స్టార్ స్టేటస్.. ఇవేవి డిప్రెషన్ నుండి మనుషులను కాపాడలేకపోతున్నాయి. అందుకే గత కొన్నిరోజులుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారి మరణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో స్టార్ సింగర్ యాడ్ అయ్యింది. హాంగ్ కాంగ్‌లో పుట్టినా.. హాలీవుడ్‌ను సైతం తన పాటలతో ఆకట్టుకున్న కోకో లీ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా తన ఫ్యామిలీనే ప్రకటించింది.
చైనీస్ అమెరికన్ సాంగ్ రైటర్, సింగర్‌గా పేరు తెచ్చుకున్న కోకో లీ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ‘చాలా బాధతో మేము ఈ వార్తను మీకు తెలియజేస్తున్నాం. కోకో గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌లో ఉంది. కానీ గత కొన్ని నెలల్లో తన కండీషన్ మరీ సీరియస్‌గా మారింది. కోకో డాక్టర్లను కన్సల్ట్ చేసి డిప్రెషన్‌తో పోరాడడానికి ప్రయత్నాలు చేసింది. కానీ తనలో ఉన్న ఆ భూతం తనను శాశ్వతంగా తీసుకెళ్లిపోయింది’ అంటూ కోకో అక్కలు కారోల్, నాన్సీ లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కోకో లీ.. తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అది గుర్తించిన తన కుటుంబ సభ్యులు తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య తరువాత కొన్నిరోజులు కోమాలో ఉంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తనను కోమా నుండి బయటికి తీసుకురాలేకపోయారు. అలా తన డిప్రెషన్‌తో పోరాడుతూ జులై 5న కోకో లీ కన్నుమూసింది. హాంగ్ కాంగ్‌లోని క్వీన్ మేరీ హాస్పిటల్‌లో తను చికిత్స పొందుతూ మరణించిందని అక్కడి మీడియా ప్రకటించింది.
హాంగ్ కాంగ్‌లో పుట్టిన కోకో లీ.. ఎక్కువగా అమెరికాలోనే జీవించింది. 1990ల్లో తైవాన్, హాంగ్ కాంగ్ వంటి దేశాలను తన మ్యూజిక్‌తో ఉర్రూతలూగించింది. చైనా, ఇంగ్లీష్‌కు చెందిన ఎన్నో వేల ఆల్బమ్స్‌లో తను పాటపాడింది. 2001లో ఆస్కార్ స్టేజ్‌పై పర్ఫార్మ్ చేసిన మొదటి చైనీస్ స్టార్‌గా కోకో లీ రికార్డ్ సాధించింది. ఈ ఏడాది కోకో తన మ్యూజిక్ జర్నీని స్టార్ చేసి 30 ఏళ్లు అవుతుందని తన సిస్టర్స్ తెలిపారు. తను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందని, తమని చాలా గర్వపడేలా చేసిందని గుర్తుచేసుకున్నారు.