E-Paper
Advertisement

Kalki 2898 AD Three Days Collections: పుంజుకున్న కలెక్షన్స్.. బాక్సాఫీసు వద్ద ‘కల్కి’ వీర బాదుడు.. మూడు రోజుల్లో ఎంతంటే?

Kalki 2898 AD Three Days Collections: పుంజుకున్న కలెక్షన్స్.. బాక్సాఫీసు వద్ద ‘కల్కి’ వీర బాదుడు.. మూడు రోజుల్లో ఎంతంటే?
Advertisement

Kalki 2898 AD Three Days Collections : ఇప్పుడంతా ‘కల్కి 2898 ఏడీ’ మానియా నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమా తప్పించి మరే సినిమా నడవడం లేదు. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. టికెట్ ఎంతున్నా వెనక్కి తగ్గడం లేదు. అదీగాక ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా మూడు రోజుల్లో భారీ కలెక్షన్లను నమోదు చేసి అదరగొట్టేసింది. మరి ఎంత మేర కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అత్యంత విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో సినీ ప్రియుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. వావ్.. అద్భుతం.. మహా అద్భుతం అనేంతలా తెరకెక్కించాడు. అసలు నాగ్ అశ్విన్‌లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అనేంతలా కల్కి చిత్రాన్ని రూపొందించాడు. హాలీవుడ్ చిత్రాల్ని తలపించేలా విజువల్స్, విఎఫ్‌వర్క్స్‌తో కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. నిజంగా అతడి క్రియేటివిటీకి ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు సెల్యూట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి డైైైైైైైైైైైైైైైైైైైైరెక్టర్లు ఉండటం ఎంతో గర్వకారణమంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read: ఘోరంగా పడిపోయిన ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ డే కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

ఇక ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే.. దంచుడే దంచుడు. ఆ లుక్, ఆ స్టైలు, సూట్ ధరించి వస్తున్న కటౌట్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా ప్రభాస్ యాక్షన్ స్టైల్‌కి నీరాజనాలు పలికారు. ఇలాంటి షేడ్స్‌లో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడలేదని చెప్పుకొస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ను చూస్తుంటే.. నిజంగా హాలీవుడ్ సినిమాలే గుర్తుకొస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ సినిమా ఇదేనని గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

మరి అలాంటి సినిమా మూడు రోజుల్లో ఎంత మేర కలెక్షన్లు సాధించిందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్లు వసూళ్లు సాధించి అబ్బురపరచింది. దీంతో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండ్రోజుల్లో ఈ సినిమా 298.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు వసూళ్లు మాత్రం కాస్త డీలా పడ్డాయనే చెప్పాలి. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా తన హవా చూపించింది. ఏకంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.415 కోట్ల కలెక్షన్లు సాధించి శభాస్ అనిపించింది. ఇక మరిన్ని రోజుల్లో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×