E-Paper
Advertisement

Kalki 2898 ad – Bujji: ప్రభాస్ కోసం స్పెషల్ ‘బుజ్జి’.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే.. సినిమా రేంజ్‌ అర్థమవుతుంది..?

Kalki 2898 ad – Bujji: ప్రభాస్ కోసం స్పెషల్ ‘బుజ్జి’.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే.. సినిమా రేంజ్‌ అర్థమవుతుంది..?
Advertisement

Kalki 2898 ad – Bujji:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో భారీ తారగణం నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇందులో ప్రభాస్ మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అచ్చం హాలీవుడ్‌ని తలపించే మార్వెల్ హీరోలా ప్రభాస్ ఉన్నాడంటూ తెగ సంబరపడిపోయారు. అత్యంత గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

Advertisement

అయితే ఇటీవల ఈ మూవీ నుంచి ‘బుజ్జ’ అనే పేరుతో ఓ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో కీర్తి సురేష్ వాయిస్‌తో కొనసాగుతుంది. అయితే బుజ్జి అంటే కల్కి మూవీ ప్రభాస్ (భైరవ) వాడే వాహనం అని తెలుస్తోంది. అయితే ఈ వాహనాన్ని సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేసారని సమాచారం. ఈ వెహికల్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను కలిసాడు.

Also Read: కల్కి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటీ సంస్థ..?

Advertisement

ఆ సమయంలో ఈ సినిమా కోసం తనకు స్పెషల్‌గా ఒక వాహనం కావాలి అని తనకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాడట. అయితే అప్పట్లో అందుకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వెహికల్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలో బుజ్జి అనే పేరుతో స్పెషల్ వెహికల్ కనపించనుండగా.. ఇప్పుడు ఆ వెహికల్‌ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

కల్కి సినిమాలో ఈ వాహనాన్ని యుద్ద సన్నివేశాలు వచ్చే సమయంలో వాడతారంట. అందువల్ల దీన్ని చాలా స్ట్రాంగ్‌గా తయారుచేసినట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా రూ.7 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఈ వాహనం గాల్లో కూడా ఎగురుతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఒక్క వెహికల్ కోసం అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×