E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్‌ను హత్తుకుని ఏడ్చేసిన రాజేంద్ర ప్రసాద్

Prabhas: ప్రభాస్‌ను హత్తుకుని ఏడ్చేసిన రాజేంద్ర ప్రసాద్
Advertisement

Prabhas.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు (Krishnam Raju) వారసుడిగా అడుగుపెట్టి నేడు రెబల్ స్టార్ గా, పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhash) హీరో గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఎంత సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా సరే తన కోసం వచ్చిన వారిని అలాగే తనకు కావలసిన వారి కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారనటంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవలే పుత్రికాశోకంతో విలవిలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ పరామర్శించడానికి ప్రభాస్ నేరుగా ఆయన ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం.

అకాల మృత్యువాతపడ్డ రాజేంద్రప్రసాద్ కుమార్తె..

Advertisement

అసలు విషయంలోకెళితే.. అక్టోబర్ ఆరవ తేదీన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఛాతీ లో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె మరణించారు. ఆ సమయంలో కుమారుడు బాలాజీ, రాజేంద్రప్రసాద్ దంపతులు మాత్రమే ఉన్నారు. గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రైవేట్ ఉద్యోగి రాజ్ కుమార్ తో వివాహం జరిపించగా.. వారికి ఒక ఒక కుమార్తె సాయి తేజస్వి కూడా ఉంది. ఇకపోతే గాయత్రి మరణం అటు సినీ సెలబ్రిటీలను, ఇటు అభిమానులను వారి కుటుంబాన్ని పూర్తిగా దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఇకపోతే శనివారం ఉదయం కేపీహెచ్బీ ఏడో ఫేజ్ లోని ఇందు విలాస్ లో రాజేంద్రప్రసాద్ నివాసానికి గాయత్రి భౌతిక కాయాన్ని తరలించగా.. చిరంజీవి , అల్లు అర్జున్, వెంకటేష్, త్రివిక్రమ్, సాయికుమార్, బ్రహ్మానందం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. ఇకపోతే గాయత్రి అంత్యక్రియలు కేపిహెచ్బి లోని కైలాస వాసంలో ఆదివారం నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన ప్రభాస్..

ఇకపోతే కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు రాజేంద్రప్రసాద్. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆయనను స్వయంగా కలుస్తూ పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి గాయత్రీ మరణం పై ఆయనను పరామర్శించబోతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా ఆయన రాజేంద్ర ప్రసాద్ ను కలిసి పరామర్శించారు. గాయత్రి మరణం తనను మానసికంగా మరింత కలచివేసిందని బాధపడ్డారు ప్రభాస్. ఇక ప్రభాస్ గాయత్రి ఫోటో దగ్గర పూలు ఉంచి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.. అనంతరం రాజేంద్రప్రసాద్ తో మాట్లాడుతూ.. ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం చూసి ప్రభాస్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతూ రాజు ఎక్కడైనా రాజే.. మంచి మనసున్న మారాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×