E-Paper
Advertisement

Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. మంత్రి కొండా సురేఖపై ప్రకాష్ రాజ్ ఫైర్

Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. మంత్రి కొండా సురేఖపై ప్రకాష్ రాజ్ ఫైర్
Advertisement

Prakash Raj:  విలక్షణ  నటుడు ప్రకాష్ రాజ్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు పేరు పెట్టేవారు లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ , ప్రకాష్ రాజ్ రాజకీయాలపైనే ప్రజలు ఆయనను ఏకిపారేస్తుంటారు. ఎలాంటి వివాదమైనా అందులో నేను ఉంటా అని వచ్చేస్తూ ఉంటాడు.

గత కొన్నిరోజులుగా తిరుపతి లడ్డూ వివాదంలో పవన్  కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న ప్రకాష్ రాజ్..  తాజాగా మంత్రి  కొండా సురేఖపై ఫైర్ అయ్యాడు. మంత్రి కొండా సురేఖ.. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఎంతోమంది హీరోయిన్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

” నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. ఈరోజు చాలామంది హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకోని, సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన అప్పట్లో మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారిని కూడా ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడేలా చేసి, రేవ్ పార్టీలు చేసుకొని, మదమెక్కి, వాళ్ళ జీవితాలతో ఆడుకొని, బ్లాక్ మెయిల్ చేసి.. వాళ్ళను ఇబ్బందిపెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి  తెలుసు. ఓపెన్ సీక్రెట్” అని  మాట్లాడింది.

ఇక  ఇందుకు సంబంధించిన  వీడియోను ప్రకాష్ రాజ్ షేర్ చేస్తూ.. మంత్రి కొండా సురేఖపై మండిపడ్డాడు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలుసినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా.. ? జస్ట్ ఆస్కింగ్” అంటూ రాసుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మొన్నటివరకు ప్రకాష్ రాజ్ ను విమర్శించిన చాలామంది.. ఈ విషయంలో మాత్రం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకులకు అసలు సిగ్గు ఉండదు.  ఏదైనా మాట్లాడతారు.. ఏదైనా చేస్తారు అని కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×