BigTV English
Advertisement

Parvathy Nair : రెండేళ్లుగా వేధింపులు, బెదిరింపులు… పని మనిషిపై దాడి కేసుపై ‘గోట్’ హీరోయిన్ రియాక్షన్

Parvathy Nair : రెండేళ్లుగా వేధింపులు, బెదిరింపులు… పని మనిషిపై దాడి కేసుపై ‘గోట్’ హీరోయిన్ రియాక్షన్

Parvathy Nair : రీసెంట్ గా దళపతి విజయ్ తో కలిసి ‘ది గోట్’ అనే సినిమాలో నటించిన తమిళ హీరోయిన్ పార్వతి నాయర్ పని మనిషిపై దాడి అనే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. తనను కులం పేరుతో దూషిస్తూ, తప్ప తాగి ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి తనపై దాడి చేశారంటూ ఆమె ఇంట్లో పని చేసిన ఓ వ్యక్తి కేసు పెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ పార్వతి నాయర్ స్పందించింది. ఒక సుధీర్ఘ ప్రకటనను విడుదల చేస్తూ ఆవేదనను వ్యక్తం చేసింది.


రెండేళ్లుగా వేధింపులు

పార్వతి నాయర్ తన పోస్టులో అక్టోబర్ 2022లో ఈ సంఘటన జరిగిందని గుర్తు చేస్తూ, అప్పటి నుంచి ఏదో ఒక రోజు వేధింపులు ఆగిపోతాయని భావించానని, అందుకే ఎప్పుడూ ఈ వివాదంపై మాట్లాడలేదని పేర్కొంది. అయితే ‘బాధ్యుడైన వ్యక్తి ఇప్పుడు నా పరువు తీయడానికి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు. ప్రచారంలో ఉన్న తప్పుడు కథనాలు, నిరాధార ఆరోపణలను ఖండించడానికి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది’ అంటూ ఆ రోజు ఏం జరిగిందో మళ్లీ వివరించింది. ‘2022 అక్టోబర్లో నా ఇంట్లో సుమారు 18 లక్షలు చోరీకి గురయ్యాయి. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అందులో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు కాగా, వారిలో సుభాష్ అనే వ్యక్తి ఒకరు. మిస్టర్ సుభాష్ నాతోపాటు ఇతరులపై ఫ్యాబ్రికేటెడ్ కౌంటర్ కంప్లైంట్ ని ఫైల్ చేశారు. నా గురించి తప్పుడు వాదనలు వ్యాప్తి చేసే విధంగా మీడియాను తప్పుదారి పట్టించారు. నా ప్రతిష్టను దిగజార్చాడు. అతను నా అన్ పబ్లిష్డ్ ఫోటోలను మీడియాకు పంపించి, నా ప్రైవసీకి భంగం కలిగించాడు’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతని కులాన్ని బట్టి ఎప్పుడూ తాను వివక్షను చూపించలేదని, సుభాష్ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, తనను చంపేస్తానని బెదిరించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ విషయం తన మానసిక స్థితిని దెబ్బతీస్తోంది అంటూ ఆ నోట్ లో వెల్లడించింది.


వివాదం ఏంటంటే?

2022లో చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా పోలీస్ స్టేషన్లో పార్వతి నాయర్ ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన ఇంట్లో పని చేసిన సుభాష్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు ఈ దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సుభాష్ హీరోయిన్ పార్వతి తో సహా మరో ఏడుగురిపై తేనామ్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పార్వతి నాయర్ తో పాటు ఓ నిర్మాత మిగతా ఆరుగురు తనను ఇంట్లో బంధించి, దాడి చేశారని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించిందని పేర్కొన్నాడు. అయితే ఈ కంప్లైంట్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. దీంతో ఆగస్టు 29న సుభాష్ ఇచ్చిన కంప్లైంట్ ని నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోర్టు చెన్నై పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ కేసు నమోదు కాకపోవడంతో సెప్టెంబర్ లో సుభాష్ చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వెళ్లి మరోసారి కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఏడు మంది పైన 3 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇప్పటిదాకా ఈ విషయంపై స్పందించని పార్వతి నాయర్ మరోసారి ఈ కేసు తన మెడకు చుట్టుకోవడంతో తాజాగా సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేసింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×