BigTV English

Prakash Raj Tweet on BJP: బీజేపీ లోకి ప్రకాష్ రాజ్.. నన్ను వాళ్లు కొనలేరు!

Prakash Raj Tweet on BJP: బీజేపీ లోకి ప్రకాష్ రాజ్.. నన్ను వాళ్లు కొనలేరు!
Prakash Raj Tweet on BJP
Prakash Raj Tweet on BJP

Prakash Raj Tweet on BJP got Viral in Social Media: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి కానీ, ఆయన నటన గురించి కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనను కొట్టేవారు లేరు. విలనిజాన్ని కానీ, ఎమోషనల్ కానీ పండించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ నిత్యం రాజకీయాలపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా మోడీ పాలన గురించి, బీజేపీ గురించి విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు.


బీజేపీ పాలన లో జరుగుతున్నా అవినీతిని, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటాడు. దీనివలన ఎన్నో సార్లు విమర్శలు కూడా అందుకున్నాడు. నటుడిగా సినిమాలు చేసుకోకుండా ఇలా బీజేపీని నిందించడంపై పలువురు ఆయనపై ఫైర్ కూడా అయ్యారు. ఇలాంటివేమి పట్టించుకోకుండా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నాడు.

తాజాగా ఒక నెటిజన్.. ప్రకాష్ రాజ్ బీజేపీ లో చేరుతున్నాడు అంటూ చేసిన ట్వీట్ పై ఆయన స్పందించాడు. సీరియస్ గా తీసుకోకుండా అతనికి కౌంటర్ వేసి షాక్ ఇచ్చాడు. “ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారు” అని ట్వీట్ చేయగా .. దానికి ప్రకాష్ రాజ్.. “అలా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ, నన్ను సైద్ధాంతికంగా(ఐడియాలాజికల్లీ) కొనేంత ధనువంతులు వారు కాదు.. మీరేమంటారు ఫ్రెండ్స్” అంటూ చెప్పుకొచ్చాడు.


ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనికి బీజేపీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వు చెప్పేవి కూడా అబద్దాలే అని కొందరు అంటుండగా.. ఇంకొందరు కాంగ్రెస్ లో చేరండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×