E-Paper

Varshangalkku Shesham OTT: ఓటీటీలోకి రూ.80 కోట్లు రాబట్టిన మరో మలయాళ బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Varshangalkku Shesham OTT: ఓటీటీలోకి రూ.80 కోట్లు రాబట్టిన మరో మలయాళ బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Varshangalkku Shesham OTT Release Date: ఒకప్పుడు మలయాళం మూవీస్ అంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈ మధ్య మలయాళం మూవీస్ వరుస పెట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకోవడంతో యావత్ సినీ ప్రేక్షకులు ఆ ఇండస్ట్రీ సినిమాలవైపే మగ్గుచూపుతున్నారు. ఇక అక్కడ సూపర్ హిట్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పటికే ప్రేమలు, ఆవేశం, ది గోట్ లైఫ్, మంజుమ్మల్ బాయ్స్ వంటి సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని కలెక్షన్లతో అదరగొట్టాయి.

అయితే ఇప్పుడు ఈ కోవలోకి మరొక మలయాళీ మూవీ వచ్చి చేరింది. అదే ‘వర్షంగల్కు శేషం’. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇందులో హీరోగా నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ప్రణవ్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అనంతరం ‘ఆది’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశాడు. అయినా ఫలితం లేదు. అవి కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేకపోయాయి. అయితే 2022లో వినీత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హృదయం’ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అతడి పేరు మారుమోగిపోయింది. ఇందులో ప్రణవ్‌కి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రణవ్ హృదయం మూవీ తర్వాత ఇప్పుడు ‘వర్షంగల్కు శేషం’ మూవీతో మరొక బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన రూ.150 కోట్ల ‘పుష్ప’ విలన్ మూవీ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

అయితే ఈ మూవీకి కూడా ‘హృదయం’ ఫేం వినీత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే మలయాళంలో అదరగొట్టిన ఈ మూవీ ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏది ఏమైనా భ్రమయుగం, ప్రేమలు, ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం తర్వాత ఈ ఏడాది రూ.50 కోట్లు మార్క్‌ను దాటిన 6వ మలయాళ చిత్రంగా ‘వర్షంగల్కు శేషం’ నిలిచింది.

ఇక థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుక సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్‌లో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇక 80s బ్యాక్ డ్రాప్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..

Big Tv Kissik Talks : కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

×