BigTV English

Aavesham Movie on OTT: ఓటీటీలోకి వచ్చేసిన రూ.150 కోట్ల ‘పుష్ప’ విలన్ మూవీ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

Aavesham Movie on OTT: ఓటీటీలోకి వచ్చేసిన రూ.150 కోట్ల ‘పుష్ప’ విలన్ మూవీ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

Pushpa 2 Fame Fahad Fazil’s Aavesham Telugu Movie Streaming in OTT: ‘పుష్ప’ మూవీలో భన్వార్ సింగ్ షెకావత్‌గా నటించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తన నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఆయన యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బన్నీ – ఫహాద్ మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అయితే ఫహాద్ ఎలాంటి పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతాడు.


హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఫహాద్ తాజాగా మరొక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ‘ఆవేశం’ మూవీ. సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. ఎవరూ ఈ మూవీపై ఆసక్తి చూపించలేదు. కానీ సినిమా రిలీజ్ అనంతరం ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది.

ఈ మూవీలో హీరోగా నటించిన ఫహాద్ ఫాజిల్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టి అందరినీ ఆశ్యర్యపరచింది. ఇక థియేటర్లలో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.


Also Read: మలయాళ ఇండస్ట్రీ.. మరో హిట్ పట్టేసింది మావా..

ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా? అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులు, అభిమానుల ముందుకు తాజాగా ఈ చిత్రం వచ్చేసింది. ఇందులో భాగంగానే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఒక రకంగా ఈ మూవీ నెల తిరగక ముందే అంటే 29 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిందన్నమాట.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.35 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. బెంగళూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫహాద్ తన క్యారెక్టర్‌తో అదరగొట్టేశాడు. మరి ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే.. ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

Tags

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×