E-Paper
Advertisement

Heroines: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్స్‌ను గుర్తుపట్టారా.. ?

Heroines: ఈ ఫొటోలో ఉన్న  హీరోయిన్స్‌ను గుర్తుపట్టారా.. ?
Advertisement

Heroines: స్టార్ హీరోస్, హీరొయిన్స్ పాత ఫోటోలు చూడడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అప్పట్లో హీరోలు ఎలా ఉండేవారు.. హీరోయిన్లు స్టార్స్ గా మారకముందు ఎలా ఉండేవారు అనేది అంచనాలు వేస్తూ ఉంటారు. తాజాగా ఒక మలయాళ సినిమా టీమ్ పాత ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ సినిమానే ప్రేమమ్. మలయాళ హీరో నివిన్ పౌలీ, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించాడు.

2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతోనే సాయి పల్లవి వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. అనుపమ సైతం ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యింది. ఇక ఈ చిత్రం వారిద్దరికీ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. తెలుగులో నాగ చైతన్య ప్రేమమ్ ను అదే పేరుతో రీమేక్ చేశాడు. అనుపమ తెలుగుకు పరిచయమైంది ఈ రీమేక్ తోనే. ప్రస్తుతం వీరందరూ స్టార్స్ గా కొనసాగుతున్నారు. నివిన్.. మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

సాయిపల్లవి.. ప్రేమమ్ తరువాత తెలుగులో ఫిదా చిత్రంతో ఎంటర్ అయ్యి లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది. అనుపమ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రేమమ్ సినిమా సక్సెస్ తరువాత తీసుకున్న ఫోటోలా అనిపిస్తుంది. అప్పట్లో అనుపమ కాస్త బొద్దుగా కనిపిస్తుంది. ఇక అప్పుడు సాయి పల్లవి ఎలా ఉందో.. ఇప్పుడు కూడా ఆమె అలానే ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి రామాయణ, తండేల్, అమరన్ సినిమాల్లో నటిస్తుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు సాయిపల్లవిని గుర్తుపడుతున్నారు కానీ, అనుపమను గుర్తుపట్టలేకపోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×