BigTV English

priyanka chopra: నాలుగు పదుల వయసులోనూ సెగలు రేపుతోంది..ప్రియాంకా చోప్రా వోగ్ కవర్ పేజీ వైరల్

priyanka chopra: నాలుగు పదుల వయసులోనూ సెగలు రేపుతోంది..ప్రియాంకా చోప్రా వోగ్ కవర్ పేజీ వైరల్

priyanka chopra mesmerize with her beauty onm vogue cover page: తన 18వ ఏటనే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది అందాల తార ప్రియాంకా చోప్రా. కమర్షియల్ యాడ్స్ తో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది. తక్కువ పీరియడ్ లోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది ప్రియాంక. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రియాంకా చోప్రాకు ఓ నిక్ నేమ్ ఇచ్చారు. పిగ్గీ చాప్స్ అని. దానితో అక్కడినుంచి ప్రియాంకను అంతా ముద్దుగా పిగ్గీ చాప్స్ అంటూ వచ్చారు. హాలీవుడ్ సినిమాలోనూ నటించారు ప్రియాంక. అయితే కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కున్నానని ప్రియాంక ఓ సందర్బంలో చెప్పుకొచ్చారు. మొదట్లో అందంగా లేవని..ఆమెకు అసలు నటన అంటేనే తెలియదని అవమానించారు.


బడా స్టార్ల సరసన

అప్పుడే నటిగా తనని తాను నిరూపించుకోవాలనే కసి పెరిగింది ప్రియాంకలో అదే పట్టుదలతో తనని తాను నటిగా నిరూపించుకుంది. బడా స్టార్లు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేలా చేసింది. సల్మాన్, షారుఖ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో నటించిన ప్రియాంక టాప్ హీరోయిన్ గా రాణించారు. నిక్ జోనాస్ తో వివాహం చేసుకున్నాక విదేశాలలో స్థిరపడిపోయారు ప్రియాంక. అయితే రీసెంట్ తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుక కోసం ఇండియాకు వచ్చింది. కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం మరాఠీ మూవీ పానీ ప్రమోషనల్ ఈవెంట్ కు సైతం హాజరయ్యారు. ది బ్లఫ్ అండ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే మూవీకి కమిట్ అయిన ప్రియాంక తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. అయితే నలభై రెండేళ్ల వయసులోనూ ప్రియాంక చోప్రా గ్లామర్ ఎంత మాత్రం తగ్గలేదు. అందుకే ప్రఖ్యాత పాపులర్ మ్యాగజైన్ వోగ్ ప్రతినిధులు ప్రియాంక చోప్రాను సంప్రదించి ఎలాగైనా కవర్ పేజీ కోసం ఫోజు ఇచ్చేలా ఆమెను ఒప్పించారు. వోగ్ కవర్ పేజీ పై ప్రియాంక అద్భుతమైన భంగిమ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఇప్పటికీ తగ్గని గ్లామర్

ఇప్పటికీ యూత్ మతులు పోగొట్టే అందంతో ప్రియాంక అందం కట్టిపడేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియాంక ఇందుకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలను రివీల్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. స్పెషల్ సఫ్రాన్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా క్యూట్ గా కనిపించి కనువిందు చేస్తోంది.
తన కూతురు మాల్టీ మేరీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను సైతం ప్రారంభించిన ప్రియంక. అయితే గత కొంత కాలంగా తన కూతురు ఫొటోలను ఎక్కడా రివీల్ చేయలేదు ప్రియాంక. అయితే ప్రస్తుతం అఫిషియల్ గా తన కూతురు పేరిట ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేసింది ప్రియాంక.

సిటాడెల్ సీక్వెల్ లో..

ప్రస్తుతం ఓ మరాఠీ మూవీ పానీ కి నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే త్వరలో షూటింగ్ మొదలుకానున్న స్పై-త్రిల్లర్ మూవీ సిటాడెల్ సీక్వెల్ లో ప్రధాన పాత్రలో కనిపించనుంది ప్రియాంక చోప్రా. ఈ ఏడాదే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డేట్స్ ప్రియాంక చోప్రా ఎడ్జెస్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి జో రస్పో దర్శకత్తం వహించనున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×