BigTV English

Will Pucovski: 26 ఏళ్లకే.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Will Pucovski: 26 ఏళ్లకే.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Will Pucovski forced to Retire From Cricket at 26 due to Medical Reasons: క్రికెట్ కెరీర్ ఇంకా పూర్తి కాకముందే తలకు బలమైన గాయం తగలడంతో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ విల్‌ పుకోవ్‌స్కీ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఆడింది ఒక మ్యాచ్, అది కూడా భారత్ తోనే ఆడాడు.  2021లో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లో 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనుకోకుండా అదే మ్యాచ్ లో భుజానికి గాయమై, ఆరునెలలు ఆటకు దూరమయ్యాడు.


నిజానికి తను ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇంకా లీగ్ మ్యాచ్ ల్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకి మరో ఆణిముత్యం దొరికిందని అంతా అనుకున్నారు. కానీ 2024లో వుకోవుస్కీకి షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో తర్వాత సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. అలాగే ఇంగ్లండ్ కౌంటీ జట్టు లీసెస్టర్ షైర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.

తరచూ ఆటలో గాయాలు కావడం, అదీ తలకు పదే పదే తగలడంతో కెరీర్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఎందుకంటే గాయాల కారణంగా కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో మానసికంగా కూడా తను డిప్రెషన్ కి గురయ్యాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు అతను క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.


ఇప్పటివరకు తనకి 13సార్లు తలకి గాయాలయ్యాయి. మరి బ్యాటింగ్ టెక్నిక్ లో లోపమో, కోచ్ లు ట్రైనింగ్ ఇవ్వడంలో లోపమో, లేక తను ప్రతి బాల్ ని కొట్టాలన్న బలమైన కోరికతో 140 కిమీ వేగంతో వచ్చే బాల్ కి ఎదురు వెళ్లడం లాంటివి చేయడమో మొత్తానికి పదేపదే తలకి గాయాలయ్యాయి. హెల్మెట్ ఉండటం వల్ల ఇంకా బతికి బట్టకట్టాడని పలువురు సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా తరఫున ఆరంగేట్రం చేసిన పుకోవుస్కీ 36 మ్యాచ్ ల్లో 2,350 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలున్నాయి. ఇక 14 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 333 పరుగులు సాధించాడు. టీ 20కి అతనికి ఆహ్వానం అందింది. ఇంతలోనే ఇలా అయ్యింది. దీంతో ఆ ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్ అయిపోయాడు.

Also Read: రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత్ క్రికెటర్..టీ20 మ్యాచ్‌లో ఉత్తమ రికార్డు!

ప్రపంచంలో క్రికెట్ ఆడేదేశాల్లో కొన్ని వేల మంది  క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంటారు. వారిలో గాయాల పాలయ్యేవారి సంఖ్య అరుదుగా జరుగుతుంటుంది. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మన దేశంలో తాజాగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా కూడా తరచూ ఇలాగే గాయాలపాలవుతుంటాడు.

మ్యాచ్ లో దిగాక…ధైర్యంగా శరీరాన్ని పణంగా పెట్టి చాలామంది ఆడుతుంటారు. కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎంతో చాకచక్యంగా బాల్ మీద పడి డైవ్ చేయాలి. ఒకవేళ బ్యాటర్ కొట్టింతర్వాత బాల్… ఫోర్స్ గా వచ్చేటప్పుడు, కాళ్లు అవి అడ్డు పెట్టాల్సి వస్తే టెక్నిక్ గా చేయాలి.

ఎందుకంటే ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు బాల్ ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే వదిలేస్తారు. మ్యాచ్ పోతే మరో మ్యాచ్…కెరీర్ పోతే ఇంక రాదు…అంతేకాదు మళ్లీ జట్టులోకి రావాలంటే పోరాడాల్సిందేనని సీనియర్లు పదే పదే చెబుతుంటారు.

మొత్తానికి 26 ఏళ్లకే విల్ పుకోవుస్కీ క్రికెట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడంపై క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×