E-Paper
Advertisement

Priyanka: గుడిలో సింపుల్‌గా నటి పెళ్లి.. ఫొటోలు వైరల్

Priyanka: గుడిలో సింపుల్‌గా నటి పెళ్లి.. ఫొటోలు వైరల్

Priyanka Nalkari: బుల్లితెర నటి ప్రియాంక నల్కారి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో వచ్చిన రోజా సీరియల్‌తో కోట్లాది మంది ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన అందరి బంధువయ, కాంచన-3, కిక్-2 వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

తాజాగా ఈ అమ్మడు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మలేషియాలోని ఓ గుడిలో సీక్రెట్‌గా తన ప్రియుడు రాహుల్ వర్మతో కలిసి ఏడడుగులు వేసింది. ఎటువంటి ఆడంభరాలు లేకుండా చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఫ్యాన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

కొంతకాలంగా ప్రియాంక, రాహుల్ డేటింగ్‌లో ఉన్నారు. రాహుల్ వృతిరిత్యా బిజినెస్‌మ్యాన్ అయినప్పటికీ పలు సీరియల్స్‌లో కూడా నటించాడు. ఈక్రమంలో ఓ తమిళ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రియాంక రాహుల్‌లకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అదికాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు.

అయితే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ జంట మలేషియాకు వెళ్లి గుడిలో ఇంత సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆడంభరంగా పెళ్లి చేసుకోవాల్సింద పోయి సింపుల్‌గా గుడిలో ఎందుకు పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా భారత్‌లో ఇన్ని గుడులున్నప్పటికీ మలేషియా వెళ్లి ఎందుకు చేసుకున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×