E-Paper
Advertisement

Kalki 2898 AD Part 2 Update: ‘కల్కి 2’ రిలీజ్‌పై నిర్మాత అశ్వినీదత్ క్రేజీ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..!

Kalki 2898 AD Part 2 Update: ‘కల్కి 2’ రిలీజ్‌పై నిర్మాత అశ్వినీదత్ క్రేజీ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..!
Advertisement

Kalki 2898 AD Part 2 Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేస్తుంది. ఈ సినిమా రెండు రోజుల్లో ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది. అంతేకాకుండా తాజాగా ఈ మూవీ సెకండ్ పార్ట్‌పై నిర్మాత అశ్విని దత్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అవేంటో తెలుసుకుందాం..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే ఆసక్తి. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా తీస్తాడో.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన అప్డేట్‌లతో ఫ్యాన్స్‌లో ఓ క్లారిటీ వచ్చేసింది. ‘కల్కి’ సినిమా ప్రభాస్ కెరీర్‌లో నిలిచిపోతుందని ఫిక్స్ అయిపోయారు.

Advertisement

పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లతో సినిమాపై ఫుల్ హైప్ పెంచేశారు మేకర్స్.. చివరిగా ట్రైలర్‌తో హాలీవుడ్ రేంజ్ సినిమా గ్రాఫిక్స్‌, విజువల్స్‌తో ఫిదా చేసేశాడు దర్శకుడు. దీంతో జూన్ 27 కోసం ఆతృతగా ఎదురుచూశారు. మొత్తంగా ఆ రోజు రానే వచ్చింది. ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్‌ టాక్‌ను ఈ సినిమా అందుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి.

Also Read: ఘోరంగా పడిపోయిన ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ డే కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

Advertisement

మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.191.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టి దుమ్ముదులిపేసింది. అలాగే రెండ్రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ.298.5 కోట్లు వసూళు చేసింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ మంచి హిట్ టాక్‌ను అందుకున్న నేపథ్యంలో నిర్మాత అశ్వినీ దత్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఈ సినిమా సెకండ్ పార్ట్‌ షూటింగ్‌, రిలీజ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ మేరకు ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందా అని అడిగిన ప్రశ్నకు.. కొంత భాగం మాత్రమే పూర్తయిందని, మూడువేల అడుగుల పుటేజ్ తమ దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు. ఇక రిలీజ్ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు.. ఇంకా ఏమీ ఆలోచించలేదని తెలిపాడు. అలాగే బహుశా వచ్చే ఏడాది ఇదే టైంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రం నుంచి ప్రస్తుతానికి రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలిపాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. ఈ రెండో పార్ట్ తర్వత ఏమైనా ఆలోచించాలి అని.. ఈ విషయం దర్శకుడు నాగ్ అశ్విన్‌ నిర్ణయానికే వదిలేస్తున్నానని అన్నాడు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×