Jr. Ntr : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈయనను ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయినా కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ సినిమా తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నేడు ఉండగా నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత ఎస్ కే ఎన్ కూడా తారక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఆ పోస్టు వైర్లవడంతో ఎన్టీఆర్ చేతికి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
ఎన్టీఆర్ కు ఎస్ కే ఎన్ విషెస్..
నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా హీరో ఇంటికి టాలీవుడ్ సెలెబ్రిటీలు వెళ్తున్నారు. అదే విధంగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్ కే ఎన్ కూడా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి స్పెషల్‌గా విష్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆ ఫోటోల్లో ఇలా హ్యాండుకి బ్యాండ్ కనిపించింది. చూస్తుంటే ఎన్టీఆర్ మణికట్టు కాస్త బెణికినట్టుంది. అందుకే బ్యాండెజ్ వేసుకున్నాడని తెలుస్తుంది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద హంగామా చేస్తున్నారు. బర్త్ డే రోజున చేతికి గాయమైందా అంటూ టెన్షన్ పడుతున్నారు.. నిజానికి ఇది ఇప్పటి ఫోటో కాదు గత ఏడాది ఆగస్టు లో తీసిన ఫోటో.. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్ కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. వార్ 2 టీజర్ సూపర్ గా ఉంది. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.. ఇదే వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ అప్డేట్స్..
ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఆయన నటిస్తున్న మూవీ వార్ 2 నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఎంతటి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నాడో చూపించారు. అయాన్ ముఖర్జీ మేకింగ్, టేకింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఇక ఈ టీజర్‌లో ఎన్టీఆర్, హృతిక్‌లు చేసిన పోరాటాలన్నీ ఒకెత్తు అయితే.. కియారా అలా బికినీలో కనిపించిన షాట్ హైలెట్.. ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:కాంతారా స్థాయిలో ‘భైరవం’ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే..?
ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్..
ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. నీల్ ప్రాజెక్ట్ కోసమే ఎన్టీఆర్ ఇలా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. అసలు ఈ రోజు నీల్ ప్రాజెక్ట్ నుంచి చిన్న పాటి గ్లింప్స్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ వార్ 2 రావడంతో ప్రశాంత్ నీల్ సైడ్ అయ్యారు. కేవలం ఒక పోస్టర్ తో మాత్రమే సరిపెట్టుకున్నారు.. అయితే ఈ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతుందని సమాచారం.. ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక వచ్చే నెల జూన్ నుంచి దేవర అటు షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారని సమాచారం..
Happy birthday to man of the masses and power house of talent
Young Tiger @tarak9999 garu #War2Teaser is fantastic 🔥🔥🔥🔥& written blockbuster in every frame ❤️❤️
Best wishes to future endeavours #HappyBirthdayNTR pic.twitter.com/FeSb2XQ7YC— SKN (Sreenivasa Kumar) (@SKNonline) May 20, 2025