Bhairavam Business: దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత మంచు మనోజ్ ‘ భైరవం ‘ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ మూవీలో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. మనోజ్ తో పాటుగా నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ మే 30 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. తమిళ సూపర్ హిట్ ‘గరుడన్’ రీమేక్ అయినప్పటికీ, ఈ సినిమా కేవలం ఆ కథ యొక్క ‘సోల్’ ను తీసుకొని పూర్తిగా ఫ్రెష్‌గా తెరకెక్కించామని దర్శకుడు విజయ్ కనకమేడల తెలిపారు.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ సినిమా బిజినెస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బ్రేక్ ఇవ్వని అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.
భైరవం బిజినెస్ వివరాలు..
మంచు మనోజ్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. దాంతో ఆయన నటిస్తున్న మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరిగిందనే టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం మేరకు.. భైరవం మూవీ ఓటీటీ, శాటిలైట్ మరియు హిందీ రైట్స్ ను ప్రముఖ సంస్థ జీ సొంతం చేసుకుంది. ఇంత ప్రైజ్ రావడానికి కారణం హిందీ రైట్స్ ఎక్కువ డబ్బులు కోట్ చేశారు.
ఎందుకంటే… హిందీ రాష్ట్రాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కు మార్కెట్ ఉంది..ఆయన సినిమాలు హిందీ డబ్ అయిన తర్వాత యూట్యూబ్ లో హిందీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. సో… అందుకే జీ హిందీ రైట్స్ కి ఎక్కువ కోట్ చేసింది. అందువల్లే.. మొత్తం 32 కోట్లు వచ్చాయని ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ అంతా కలిపి 50 నుంచి 55 కోట్ల వరకు బిజినెస్ అయింది. ఈ మూవీ 60 కోట్ల టార్గెట్ తో థియేటర్ల లోకి రాబోతుంది.. మరి ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి..
Also Read :పెళ్ళైన కొద్దిరోజుల్లోనే.. అభినయ భర్త గురించి బయటపడ్డ భయంకరమైన నిజం..
జూన్ 1 న థియేటర్లు బంద్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కోసం బుక్ చేసుకున్న డేట్ మే 30. తేదీన ఈ సినిమా రావడంతో సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎటువంటి సినిమాలు పోటీకి లేకపోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సినిమా ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. అయితే జూన్ 1న థియేటర్లు బంద్ కాబోతున్నాయంటూ ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. భైరవం టీమ్ ప్రమోషన్లు ఆపడం లేదు. జూన్ 12 పవన్ కళ్యాణ్ వచ్చేదాకా ఏర్పడే గ్యాప్ ని వాడుకునే ఉద్దేశంతో భైరవం ఈ తేదీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఉంది. నాంది పేరు తెచ్చినా ఉగ్రం నిరాశపరచడంతో దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమా మీద బాగా కసిగా పని చేశారు.. మరి ఏ మాత్రం వసూళ్లను రాబడుతుందో తెలియాలంటే మరో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే..