E-Paper
Advertisement

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్
Advertisement

Puri Jagannadh: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల పేర్లు ప్రస్తావన వస్తే మొదటిగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. బద్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూరి మొదటి సినిమాతోనే అద్భుతమైన పేరును సాధించుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సరైన దర్శకుడు వచ్చాడు అని అనిపించుకున్నాడు. అందరిలా కాకుండా హీరో క్యారట్రైజేషన్ లో మంచి మార్పులు తీసుకొచ్చాడు. ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా అంటే బద్రి అని చెప్పొచ్చు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోకి ఆటిట్యూడ్ అనే పద్ధతిని అప్లై చేసి చూపించింది పూరి జగన్నాథ్.

ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. కేవలం కథ మాత్రమే కాకుండా హీరో క్యారెక్టర్ తో కూడా సినిమాల్ని నడిపించిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. చాలామంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సినిమాలు తో రిపీటెడ్ గా వర్క్ చేశాడు. అలానే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టాడు పూరి. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో వర్క్ చేశాడు అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుసగా డిజాస్టర్ సినిమాలు తీస్తున్నాడు. రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డబ్బులు ఇస్మార్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Advertisement

ఇక మామూలుగా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. అలానే దర్శకుడు కూడా అభిమానులు ఉండటం అనేది రాంగోపాల్ వర్మ నుంచి మొదలైంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కి ప్రత్యేకంగా అభిమానులు ఉండటం మొదలుపెట్టారు. దీని కారణం పూరి తీసిన సినిమాలు, ఆ సినిమాలోని క్యారెక్టర్స్ విపరీతంగా కనెక్ట్ అవ్వడం చెప్పాలి. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, రాజమౌళి దర్శకులు కూడా అభిమానులు ఉన్నారు. పూరి జగన్నాథ్ విషయానికొస్తే పూరి జగన్నాథ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. చాలామంది పూరి జగన్నాథ్ బర్త్ డే కి కలిసి విషెస్ కూడా చెబుతారు.

ఇక నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అభిమానులు పూరి జగన్నాథ్ ను కలవడానికి హైదరాబాద్ వచ్చారు. అయితే ఆ వచ్చిన అభిమానులు అందరూ కూడా ఆకాష్ పూరి ను కలిసారు. అక్కడితో ఆకాష్ పూరి జగన్నాథ్ వీడియో కాల్ మాట్లాడించారు. పూరి జగన్నాథ్ ముంబై నుంచి తన అభిమానులతో వీడియో కాల్ మాట్లాడుతూ పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలానే త్వరలోనే కలుద్దాం అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఇక కొంతకాలంగా పూరి జగన్నాథ్ ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×