BigTV English

Ola S1 X: ఓలా ఎలక్ట్రిక్ బైక్ పై భారీ తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కళ్లు చెదిరే ఆఫర్

Ola S1 X: ఓలా ఎలక్ట్రిక్ బైక్ పై భారీ తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కళ్లు చెదిరే ఆఫర్

Flipkart Big Billion Days Sale: దిగ్గజ ఆన్ లైన స్టోర్ ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా వినియోగదారులకు సూపర్ డూపర్ ఆఫర్లు అందిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ సేల్‌ లో ఓలా మోడల్ S1 X మోడల్ పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.  జూలై నుంచి ఆగస్టు వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈవీ అమ్మకాలు 25 శాతం తగ్గినప్పటికీ, Ola ఎలక్ట్రిక్ ఆగస్ట్‌ లో 12,636 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో 27 శాతం వాటాను కలిగి ఉంది.


Ola S1 Xపై సూపర్ సేల్ డీల్స్

ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌ కార్ట్ మంచి రాయితీలు అందిస్తోంది. Ola S1 X శ్రేణి ఈవీలపై అకట్టుకునే ఆఫర్లు ఇస్తున్నది. ఎంట్రీ లెవల్ S1 X (2 kWh) మోడల్ ధర  ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌ సైట్‌ లో రూ. 74, 999 ఉండగా, ఫ్లిప్ కార్ట్ రూ. 67,999కే అందిస్తోంది. ఎమ్మార్పీతో పోల్చితే రూ. 7,000 తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇక మిడ్-లెవల్ S1 X (3 kWh) ఓలా వెబ్ సైట్ లో రూ. 87,999 ధర ఉండగా, ఫ్లిప్‌ కార్ట్ దీన్ని రూ. 77,999కే అందిస్తోంది. ఈ స్కూటర్ మీద ఏకంగా రూ. 10,000 తగ్గింపు అందిస్తోంది. టాప్ ఆఫ్ లైన్ S1 X (4 kWh) కంపెనీ వెబ్ సైట్ లోరూ. 101,399కి అందుబాటులో ఉండగా,  ఫ్లిప్‌ కార్ట్‌ లో ఈ స్కూటర్‌ ధర దాదాపు రూ. 6,000 తగ్గింపుతో  రూ. 94,999కే అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్‌ తో సహా ప్రముఖ క్రెడిట్ కార్డ్‌ లపై ఫ్లిప్‌ కార్ట్ అదనంగా 5 శాతం తగ్గింపును ఇస్తోంది.


Read Also:పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Ola S1 X ఈవీ స్పెసిఫికేషన్లు

ఎంట్రీ లెవల్ Ola S1 X (2 kWh) వెర్షన్ 6 Kw శక్తిని కలిగి ఉంటుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో వెళ్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. S1 X (3 kWh) మోడల్ 151 కి.మీ పరిధిని అందిస్తుంది. గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ  ఫుల్ ఛార్జ్ కావడానికి 7.4 గంటల సమయం పడుతుంది. S1 X (4 kWh) కూడా గరిష్టంగా 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 193 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది. ఈ మూడు వేరియంట్లలో ఎకో, నార్మల్, స్పోర్ట్స్  రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అటు ఇతర ఎలక్ట్రిక్ ఐటెమ్స్ పైనా ఫ్లిప్‌ కార్ట్ భారీగా తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నది.

Read Also: పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×