E-Paper
Advertisement

National Award to Pushpa: బన్నీనే బెస్ట్ యాక్టర్.. హీరోయిజానికి సరికొత్త డెఫినేషన్.. తగ్గేదేలే..

National Award to Pushpa: బన్నీనే బెస్ట్ యాక్టర్.. హీరోయిజానికి సరికొత్త డెఫినేషన్.. తగ్గేదేలే..
Advertisement
Allu Arjun national award news

Allu Arjun national award news(Today tollywood news) :

పుష్ప. తగ్గేదేలే. ఈ డైలాగ్‌కు ఇండియా వైడ్ రీసౌండ్ వచ్చింది. పుష్ప మేనియా పాన్ ఇండియా వైజ్ దుమ్ము రేపింది. ఇప్పుడు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించింది. దటీజ్ అల్లు అర్జున్. అలియాస్ బన్నీ. తగ్గేదేలే.

హీరో అంటే టిప్ టాప్‌గా ఉండాలి. నీట్‌గా, స్టైల్‌గా కనిపించాలి. మ్యాన్లీగా ఉండాలి. అమ్మాయిల వెంటపడాలి. ఫ్యామిలీ డ్రామా రక్తికట్టించాలి. డ్యాన్సులు, ఫైట్లు ఇరగదీయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. సిక్స్ ప్యాక్స్‌తో బాడీ బిల్డర్‌లా ఉండాలి.. అనేది అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్. పుష్పతో స్టైలిష్ స్టార్.. హీరో క్రేజ్‌ను మార్చేశారు. పక్కా మాస్‌గా కనిపించి.. కిరాక్ లేపారు.

Advertisement

పెరిగిన జుట్టు, నెరిసిన గడ్డం, కాస్త అంగవైకల్యం, ఒంటిపై బనీను, పాతకాలంనాటి పూల చొక్కాలు, నుదిట బొట్టు. అయితేనేం.. హీరో అంటే వీడేరా అనిపించేలా ఇరగదీశాడు పుష్ప. మాస్ మేనరిజంతో.. హీరోయిజానికి సరికొత్త డెఫినేషన్ చెప్పాడు. ఇండియాను షేక్ చేశాడు. డైలాగ్ డెలివరీతో దుమ్ము రేపాడు. తగ్గేదేలే.. అంటూ తనదైన సిగ్నేచర్ స్టైల్‌తో పుష్ప బ్రాండ్ క్రియేట్ చేశాడు. అందుకే, పుష్ప కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది. ఇదిగో.. ఇప్పుడు ఏకంగా తెలుగు నుంచి తొలిసారి జాతీయ ఉత్తమ అవార్డు సాధించిన హీరోగా చరిత్రలో నిలబెట్టింది.

బన్నీతో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ దేవీశ్రీ ప్రసాద్‌కు సైతం ఇదే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం డబుల్ ధమాకా. ఊ అంటావా మావా.. చూపే బంగారమాయేగా శ్రీవల్లీ.. ఏ బిడ్డా ఇది నా అడ్డ.. లాంటి పాటలు యావత్ దేశాన్ని ఊపేశాయి. అందుకే, జాతీయ సినీ అవార్డు కూడా వరించింది. ఇలా ఇద్దరు స్నేహితులు.. నేషనల్ అవార్డులతో తగ్గేదేలే అనిపించారు. మరి, పార్టీ లేదా పుష్ఫ.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×