BigTV English

NTR Image on 100 Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం.. ఛలో ఢిల్లీ..

NTR Image on 100 Coin: ఎన్టీఆర్ రూ.100 నాణెం.. ఛలో ఢిల్లీ..


Sr NTR latest news

Sr NTR latest news (AP political news) :

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు మీద ప్రత్యేక వంద రూపాయల నాణెం రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 28న ఢిల్లీ, రాష్ట్రపతి భవన్‌లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్మారక నాణెంను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ వచ్చింది.


ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే వంద రూపాయిల నాణేన్ని.. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఏడాదికి సింబాలిక్‌గా 1923-2023 అని ముద్రితమై ఉంటుంది.

మరోవైపు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు. ఈసీ అధికారులతో భేటీ తర్వాత.. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని తెలుస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×