E-Paper
Advertisement

R S Praveen Kumar IPS: ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ ఫస్ట్ గ్లింప్స్ .. వచ్చేసిందోచ్..

R S Praveen Kumar IPS: ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ ఫస్ట్ గ్లింప్స్ .. వచ్చేసిందోచ్..
Advertisement

R S Praveen Kumar IPS: తెలంగాణ బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను చిత్ర రూపంలో బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిపోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీలా మామిడాల నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోంది.

యూనిక్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు దుర్గా దేవ్ నాయుడు నిర్వహిస్తున్నారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి బయోపిక్ కావడంతో ఈ చిత్రంలో మంచి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

Advertisement

వివేక్ కూచిబొట్ల ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. తాజాగా మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీ గురించి నిర్మాత దామోదర్ ప్రసాద్.. ప్రవీణ్ ఐపిఎస్ కేవలం ఒక మూవీ మాత్రమే కాదని.. అది నిజంగా ఒక మనిషి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథ అని అన్నారు. ఇటువంటి సాలిడ్ కథా, కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము కాబట్టి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ మూవీ కి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ప్రవీణ్ ఐపిఎస్ చిత్ర యూనిట్, ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ రమణ తేజ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. ” ప్రవీణ్ ఐపిఎస్ లాంటి సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రేక్షకుల మనసుకు బాగా కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను, ఈ మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×