E-Paper
Advertisement

Mega 156: అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఆ పవర్ఫుల్ యాక్టర్ తోనే.. మెగా ఖుష్ అవుతున్న అభిమానులు..

Mega 156: అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఆ పవర్ఫుల్ యాక్టర్ తోనే.. మెగా ఖుష్ అవుతున్న అభిమానులు..
Advertisement

Mega 156: అనిల్ రావిపూడి ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ డైరెక్టర్ బాలయ్య మూవీతో మాస్ సినిమాలకు సైతం రెడీ అని నిరూపించుకున్నాడు. ఇంతక ముందు మహేష్ లాంటి క్లాస్ స్టార్ ను సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మాస్ యాంగిల్ లో ఎస్టాబ్లిష్ చేశాడు.ఇప్పుడు బాలకృష్ణ లాంటి మాస్ పర్సనాలిటీ తో భగవంత్ కేసరి సినిమా చేసి ప్రజెంట్ టాలీవుడ్ లో సూపర్ డైరక్టర్ గా నిలిచాడు. ఇప్పుడు క్లాస్ అయినా మాస్ అయినా దేనికైనా రెడీ అంటున్నాడు.

ఇక అనిల్ నెక్స్ట్ తన మూవీ ఏ హీరో తో చేస్తాడన్న విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనిల్ నెక్స్ట్ హీరో ఎవరు అన్న విషయం పై సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటో కాదు అనిల్ నెక్స్ట్ మూవీ చేయబోయేది మెగాస్టార్ చిరంజీవి తోనే అనేది ఆ న్యూస్. పైగా ఈ మూవీకి దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

Advertisement

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక ఆచార్య, గాడ్ ఫాదర్ నిరాశపరిచినా.. వాల్తేరు వీరయ్య రూపంలో మంచి సక్సెస్ అందుకున్నాడు చిరంజీవి. అయితే భోళా శంకర్ విషయంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. ఇక అప్పటి నుంచి తన చిత్రాల గురించి ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు మెగాస్టార్. పైగా ఇక తన ఏజ్ కి తగిన రోల్స్ చేయాలని చిరంజీవి కూడా డిసైడ్ అయినట్లు మెగా కాంపౌండ్ నుంచి సమాచారం.

ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో మెగాస్టార్ నెక్స్ట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఆయుధాల పూజ సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రం పై మాంచి బజ్ క్రియేట్ చేసింది. చుట్టూ అలుముకుంటున్న విధ్వంసం మధ్యలో నుంచి ఉద్భవించిన త్రిశూలాన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మెగా 156 పోస్టర్ చాలా యూనిక్ గా ఉంది. అయితే గత కొద్ది కాలంగా చిరుతో కళ్యాణ్ కృష్ణ మూవీ రాబోతోంది అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పుడు వశిష్ఠ తో మూవీ అనౌన్స్ అయిన తర్వాత కళ్యాణ్ కృష్ణ తో మూవీ లేనట్టే అని స్పష్టం అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ భోళా శంకర్ రిజల్ట్ అని తెలుస్తుంది. అందుకే తన ఏజ్ కి తగ్గ రోల్ చేసి బాలకృష్ణ హిట్ అందుకున్నట్టే చిరు కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన ఏజ్ కి తగ్గ రోల్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇక అనిల్, చిరుని ఎటువంటి రోల్ లో చూపిస్తాడు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాగే చిరు మాస్ ఎలిమెంట్ ఉన్న మూవీ చేస్తాడా.. లేక తనదైన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ వైపు వస్తాడా చూడాలి మరి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×