E-Paper
Advertisement

Bhale Unnade Teaser: రాజ్ తరుణ్ భలే ఉన్నాడే టీజర్.. భలే ఉందే

Bhale Unnade Teaser: రాజ్ తరుణ్ భలే ఉన్నాడే టీజర్.. భలే ఉందే
Advertisement

Bhale Unnade Teaser: కుర్ర హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. సినిమాలు చేస్తున్నాడు కానీ, విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం భలే ఉన్నాడే. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని NV కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మనీషా కంద్కూర్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఇలాంటి కథతో ఎలాంటి సినిమా రాలేదని చెప్పుకోవచ్చు. మహిళలు కట్టుకొనే చీరల షాప్స్ లో ఎక్కవ పురుషులే వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యాషన్ డిజైనర్స్ లో ఎక్కువ మగవారే ఉంటారు. ఈ కథలో హీరో కూడా ఒక చిన్నపాటి ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట.

Advertisement

పెళ్లి కూతుళ్ళకు చీరలు కట్టడం, మేకప్ చేయడం.. పెళ్ళికి కావాల్సిన పనులు చేయడం తన వృత్తి. అయితే నిత్యం అమ్మాయిలను తాకినా.. అతను మాతం అమ్మాయిల వంక చూడడు. ఇక అలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది. అతడి బిహేవియర్ చూసి ప్రేమలో పడుతుంది. మరి చివరికి హీరోను మార్చగలిగిందా.. ? అతడి ప్రేమను పొందగలిగిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రాజ్ తరుణ్ యాక్టింగ్ చాలా బావుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×