Big Stories

PM Modi: ‘బీజేపీ మంత్రం అభివృద్ధి.. వైసీపీ మంత్రం అవినీతి’

Prime Minister Modi: కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని మోదీ అనపల్లి జిల్లాలో రాజుపాలెంలో కూటమి బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సభలో మోదీతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

ఏపీలో కేంద్రం అనేక పనులు చేస్తోందని మోదీ తెలిపారు. వైసీపీ సర్కార్ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ మంత్రం అభివృద్ధి.. వైసీపీ మంత్రం అవినీతి అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధికి బ్రేకులు వేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో రైల్వేజోనే ఏర్పాటు చేయాలనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేదని వెల్లడించారు.

- Advertisement -

‘ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతోంది. ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. చంద్రుడి దక్షిణ భాగంపై భారత్ అడుగుపెట్టింది. ఏపీ యువత కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. ఏపీకి ట్రిపుల్ ఐటీ, ఐసర్, ఐఐఎం మంజూరు చేశాం. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది.

ఏపీలో పేదలకు 21 లక్షల ఇళ్లు ఇచ్చాం. వైసీపీ అందులో సగం కూడా పేదలకు ఇవ్వలేదు. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు.. వైసీపీ ప్రభుత్వం పనితీరుకు అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించారు. జగన్ తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. కానీ, తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా ఆపేసింది.

పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. అనకాపల్లిలో రైతులు చెరకు పండించడం మానేశారు. ఈ ప్రాంతంలో చాలా చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

ఏపీ అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. రాబోయే రోజుల్లో మనకు అన్నీ మంచిశకునాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీకి అన్నీ పీడ శకునాలే రానున్నాయని చంద్రబాబు తెలిపారు. సైకో జగన్ పోవాలి.. ప్రజలు గెలివాలి.. రాష్ట్రం నిలవాలి అంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. రాజధానుల పేరిట లూటీ : పీఎం మోదీ

‘ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సీట్ల కోసం పవన్ ఆలోచించలేదు. పవన్ విశాఖ వస్తే ఆటంకాలు కలిగించారు. పవన్ ను బలవంతంగా తరలించారు. విశాఖ నగరం జగన్ సొత్త కాదు. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు. మోదీ కూడా చెప్పారు గెలుపు మనదే. అవినీతి ప్రభుత్వం ఇంటికే. అధికారం ఉందని సైకో విర్రవీగాడు. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో.. మోదీ, అమిత్ షా చెప్పారు’ అని చంద్రబాబు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News