E-Paper
Advertisement

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. వీడియో వైరల్

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. వీడియో వైరల్
Advertisement

Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా తమ జీవితంలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వర్క్ చేయాలి అనుకుంటారు. అయితే.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా రాజమౌళితో కలిసి నటించాడు. ఏంటి.. నిజమా అంటే అవును నిజం. రాజమౌళి ఈ మధ్యనే కొన్ని యాడ్స్ చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో రాజమౌళి క్రెడ్ కు సంబంధించిన ఓ యాడ్ లో నటించాడు.

వార్నర్ గురించి సోషల్ మీడియా వాడే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పుష్ప అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్. పుష్ప రిలీజ్ అయినదగ్గరనుంచి తగ్గేదేలే అంటూ రీల్స్ చేస్తూనే ఉన్నాడు. ఇండియా అంటే అంత అభిమానం ఆయనకు. ఎన్నోసార్లు మీమ్స్ లో వార్నర్ ను టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వమని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ యాడ్ ద్వారా ఆ కోరికను నెరవేర్చుకున్నారు వార్నర్. క్రెడ్ వాడితే.. డిస్కౌంట్ వస్తుంది అని చెప్పడానికి వీరు ఏకం అయ్యారు.

Advertisement

రాజమౌళి మ్యాచ్ టికెట్స్ ను డిస్కౌంట్ లో ఇప్పించమని వార్నర్ కు కాల్ చేయగా క్రెడ్ UPI లో కట్టమని సలహా ఇస్తాడు. అయితే రాజమౌళి తన దగ్గర అది లేదని, నార్మల్ UPI లో కడితే డిస్కౌంట్ ఇస్తారా.. ? అంటే.. వార్నర్ దానికి ఒక పని చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. అదే తనతో మరో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలు తీయాలని.. ఇక జక్కన్న ఆ విజువల్స్ ను ఫ్లాష్ లో వేసుకుంటాడు. అదంతా అయ్యేపని కాదని.. వద్దు.. నేను క్రెడ్ లోనే కట్టుకుంటాను అని చెప్పడంతో యాడ్ ముగిసింది. ఏదిఏమైనా రాజమౌళి దర్శకత్వంలో వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ నిజంగా ఇవ్వకపోయినా.. ఈ యాడ్ ద్వారా కానిచ్చేశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×