BigTV English

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం.. సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు

KRMB: కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం..  సాగర్‌లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపు

KRMB Three Member Committee: వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చర్చించాయి. ఈ నీటి కేటాయింపులపై కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది.


నాగార్జున సాగర్ లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు ఈ కమిటీల కేటాయించింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేఆర్‌ఎంబీ కమిటీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమీటీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మే నెలలో కేఆర్‌ఎంబీ మరోసారి ఈ కేటాయింపుల విషయంలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలశౌధలో నిర్వహించారు.


తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణకు అదనంగా 7 టీఎంసీల నీటిని వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొంది. సాగర్ నుంచి వెంటనే తమకు రావాల్సిన 5 టీఎంసీల నీటిని ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేసింది.

Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×