BigTV English

SSMB29 Update: మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్లు.. ప్లాన్ మామూలుగా లేదు

SSMB29 Update: మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్లు.. ప్లాన్ మామూలుగా లేదు


Hollywood Directors for SSMB29: మహేశ్ బాబు ఇటీవల నటించిన గుంటూరు కారం సినిమా భారీ అంచనాలతో సంక్రాంతికి రిలీజైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్లలో మాత్రం ఈ మూవీ తన హవా చూపించింది.

ఇక థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హిందీ భాషలో అయితే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నాడు.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పలు వర్క్స్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్ బాబు లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని బయట టాక్ వినిపిస్తోంది.

READ MORE:ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి..

తాజా సమచారం ప్రకారం.. దర్శకుడు రాజమౌళి ఈ మూవీ కోసం హాలీవుడ్ నుంచి ప్రముఖ దర్శకులను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎంతగానో ఆరాధించే స్టీవెన్ స్పీల్బర్గ్, అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌లను ఓ వేడుకకు అతిథులుగా తీసుకువచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

అయితే ఇందులో ఇద్దరు దర్శకులు రావడం కుదరకపోతే.. కనీసం ఒకరినైనా తీసుకువచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి నిర్వహించే ఈ ఈవెంట్‌ను హాలీవుడ్ దర్శకులు వస్తే ఆ కిక్కే వేరే అని చెప్పాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×