BigTV English
Advertisement

Rajamouli : రాజమౌళి న్యూ లుక్ అదుర్స్.. అక్కడ పెంచావు.. ఇక్కడ తగ్గించావు..

Rajamouli : రాజమౌళి న్యూ లుక్ అదుర్స్.. అక్కడ పెంచావు.. ఇక్కడ తగ్గించావు..

Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు.. ఈయన తెరాకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈయనను ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తారా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడంతో జక్కన్న హాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యారు.. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే పని.. ఇక ఈయన సినిమాల విషయం పక్కన పెడితే ఈయన లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రాజమౌళి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టారు. రాజమౌళి దర్శకుడిగానే కాకుండా ఒకట్రెండు సినిమాలలో నటనతో కూడా ఎట్రాక్ట్ చేశాడు. ఇటీవల ఆయన ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి’ చిత్రంలో ఒక కీలక క్యామియో పాత్రలో కనిపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజమౌళి లుక్ ని మొదట సీక్రెట్ గా ఉంచారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆయన ఆ లుక్ ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఈయన లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జక్కన్న బ్రౌన్ టీ షర్ట్ మరియు స్టైలిష్ జాకెట్ లో కనిపించారు. ఈ లుక్ లో ఆయన పూర్తిగా మాస్ అవతారంలో ఉన్నారని చెప్పుకోవచ్చు..

ఆ లుక్ ను చూసిన ఫ్యాన్స్ కల్కి 2 లుక్ కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకుడు ఇలా ఒక స్పెషల్ పాత్రలో కనిపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది.. మొన్న సినిమాలో జక్కన్న పెర్ఫార్మన్స్ బాగుంది. ఇక పార్ట్ 2 లో ఎలా ఉండబోతున్నాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ బాబు తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. అంతేకాకుండా ఇది మహేష్ బాబు మొదటి పాన్ వరల్డ్ సినిమా కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2025లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరో మూడేళ్లకు ఆ సినిమా వస్తుంది.. ఆ తర్వాత ఎన్టీఆర్ లేదా ప్రభాస్ తో సినిమా చెయ్యనున్నాడని సమాచారం.. కార్తీ, సూర్యలతో మరో సినిమా చెయ్యనున్నాడని టాక్..


 

Tags

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×