E-Paper
Advertisement

RAKSHASUDU 2: సెట్స్ పై రాక్షసుడు 2.. ఘాటుగా పోస్టర్ వేసి మరీ ప్రకటించిన చిత్ర బృందం.

RAKSHASUDU 2: సెట్స్ పై రాక్షసుడు 2.. ఘాటుగా పోస్టర్ వేసి మరీ ప్రకటించిన చిత్ర బృందం.
Advertisement

RAKSHASUDU 2: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రాలలో కమర్షియల్ గా మంచి టాక్ సొంతం చేసుకొని హిట్ అయిన మూవీ ‘రాక్షసుడు’. సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళ్ లో హిట్ అయిన రాచ్చసన్‌ అనే మూవీకి రీమేక్. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం చూసిన డైరెక్టర్ రమేష్ వర్మ ఆ సమయంలో తిరిగి ఈ చిత్రానికి సీక్వెల్ కూడా చేస్తాను అంటూ ప్రకటించడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పటికీ రాక్షసుడు మూవీకి సీక్వెల్ మొదలుపెట్టారు డైరెక్టర్.

2019లో విడుదలైన రాక్షసుడు మూవీ సైకో కిల్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగినప్పటికీ కథనం వినూత్నంగా ఉండడంతో బాగా క్లిక్ అయింది. యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా సాగే ఈ మూవీలో ఎమోషన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్, వినోథ్,సుజనే గోర్గే, రాజీవ్ కనకాల, సూర్య, రాధా రవి, నాన్ సరవనన్ ముఖ్యపాత్రలో నటించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫిలిం మేకర్ అవ్వాలి అనుకొని ఫైనల్ గా పోలీస్ ఆఫీసర్ అవుతాడు అరుణ్. అయితే ఇంకా ఇండస్ట్రీ మీద మమత చావక వినూతమైన కథ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైకోలు, ఉన్మాదులు.. వారు చేసినటువంటి క్రైమ్ పై స్టడీ చేస్తూ ఉంటాడు.

Advertisement

వీటిని ఆధారంగా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ని ఎప్పటికైనా చేయాలని అతని కోరిక. ఈ నేపథ్యంలో అతని చుట్టూ జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా ఒక సైకో వేటలో బిజీ అయిపోతాడు. ఎక్కడో బయట జరుగుతున్న నేరాలను ఆపడానికి ప్రయత్నిస్తున్న అతను అతని ,భావ ఇద్దరు అనుకోకుండా ఇంట్లోనే ఒక ఘోరాన్ని చూడాల్సి వస్తుంది. దీంతో ఎలాగైనా ఇది ఆపాలి అని పట్టుబట్టిన అరుణ్ ఆ తరువాత తన దగ్గర ఉన్నటువంటి ఈ రీసెర్చ్ వర్క్ ఆధారంగా అసలు సైకోని ట్రేస్ అవుట్ చేస్తాడు. ఆద్యంతం ఎంతో ఉత్కంఠతతో సాగే ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించడంతో ఈ మూవీ అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్ అయ్యింది. రమేష్ వర్మ కూడా తాను అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు రాక్షసుడికి సీక్వెల్ సినిమా మొదలుపెట్టేసాడు. చాలా కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగడంతో తాజాగా సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. రాక్షసుడు టు షూటింగ్ ప్రారంభమైంది అంటూ వచ్చిన ఆ పోస్టర్ కూడా చిత్రంపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.

Advertisement

అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే రాక్షసుడు చిత్రం కు ఒరిజినల్ అయినా తమిళ్ రాచ్చసన్‌ మూవీ సీక్వెల్ ఫై ఇంకా ఆ చిత్రం మేకర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ దాని నుంచి వచ్చిన రీమేక్ చిత్రం కు మాత్రం త్వరలో సీక్వెల్ కూడా సిద్ధం కాబోతుంది. పైగా రాబోయే ఈ సీక్వెల్ చిత్రంలోని విలన్ పాత్ర మొదటి చిత్రం కంటే ఎంతో స్ట్రాంగ్ గా నిర్మించడం జరిగిందట. అందుకే ఆ పాత్రకు సెట్ అయ్యే విధంగా ఉండడం కోసం ఒక బాలీవుడ్ యాక్టర్ ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని సెట్ అయితే ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×