BigTV English

Aman Preet Singh: బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు

Aman Preet Singh: బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు

Aman Preet Singh: ఎన్ని చర్యలు చేపట్టినా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడడాన్ని మాత్రం నివారించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదరడం లేదని, సెలబ్రిటీలు బెంగుళూరుకు వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ టాలీవుడ్ ప్రముఖులు దొరికిన విషయం తెల్సిందే. అందులో నటి హేమ కూడా ఉండడంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.


ఇక ఆ ఘటనను మరువకముందే.. డ్రగ్స్ సరఫరా చేస్తూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. కొకైన్ ను సరఫరా చేస్తూ.. నలుగురు నైజీరియన్లతో పాటు రకుల్ తమ్ముడు అమన్ కూడా పోలీసులకు దొరికాడు.

వెంటనే పోలీసులు ఈ ఐదుగురును అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 200 గ్రాములకు పైగా కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అమన్.. డ్రగ్స్ సేవిస్తూ కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అతనిని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అమన్ తో పాటు దీని వెనుక చాలామంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలామంది సెలబ్రిటీస్ కు వీరితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.


తమ్ముడే కాదు రకుల్ కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెల్సిందే. గతంలో ఆమె డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరయ్యింది. అయితే ఒక రాజకీయ నేత అధికారంలో ఉండడంతో ఆమె బయటపడింది. ఇప్పుడు ఆమె తమ్ముడు. సైతం డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. మరి ఈ విషయమై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Big Stories

×