BigTV English

Israel Gaza War: స్కూల్స్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడి..15 మంది మృతి

Israel Gaza War: స్కూల్స్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడి..15 మంది మృతి

Israel Gaza War: గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజా పట్టణంలోని స్కూళ్లపై ఇజ్రాయిల్ దాడి చేసింది. కొన్ని రోజులుగా స్కూల్స్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ బాంబులు వేసింది. దీంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు.


గాజా స్కూల్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘటనలో 15 మంది మృతి చెందినట్లు గాజా సివిల్ డిఫన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్దం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్‌లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లోనే గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇది ఐదవసారి. ఆ దాడిపై ఇజ్రాయిల్ స్పందించింది. అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయిల్ సైన్యంపై దాడులు జరుగుతుండటంతోనే తాము కూడా టార్గెట్ చేశామని ఇజ్రాయిల్ తెలిపింది.

గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయిల్‌పై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో వందల మంది మృతి చెందారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే తీవ్ర భయానక పరిస్థితులు గాజాలో ఉన్నాయి. గాజాపై ఇజ్రాయిల్ బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరుపుతోంది. దీంతో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇజ్రాయిల్ దాడుల కారణంగా ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90% మంది వారి ఇళ్లను విడిచి పారిపోవాల్సి వచ్చింది.


వీరిలో కొంతమంది మిగిలిన ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఏర్పాటు చేసిన పాఠశాలలో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. అయితే దీనిపై ఇజ్రాయిల్ దాడి చేయగా 15 మంది మరణించారు. హమాస్ ఆధ్వర్యంలో నడిచే సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. అందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పారు. అయితే అనంతరం ఈ సంఖ్య 22కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ మారణహోమంను హమాస్ ఖండించింది.

Also Read: ఇజ్రాయిల్ హింసాత్మక దాడి, 71 మంది మృతి

హమాస్ రాజకీయ నేతలు పోలీస్ అధికారులు, ఉద్యమ నేతలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్ సమీపంలోని మరో పట్టణంలోని పాఠశాల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 29 మరణించినట్లు ఆ పట్టణ ఆసుపత్రి అధికారులు తెలిపారు. హమాస్ ప్రభుత్వ సీనియర్ అధికారితో సహా మొత్తం 20 మంది వ్యక్తులు గతంలో మూడు దాడుల్లో, మరో పాఠశాల, గాజా నగరంలో చర్చి ఆధ్వర్యంలో నడిచే పాఠశాల దాడుల్లో మరణించినట్లు వెల్లడించారు.

 

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×