E-Paper
Advertisement

Ram Charan: ‘గుడ్ మార్నింగ్ అమెరికా – రామ్ చరణ్’… యు.ఎస్‌లో మెగా పవర్‌స్టార్ సంద‌డి

Ram Charan: ‘గుడ్ మార్నింగ్ అమెరికా – రామ్ చరణ్’… యు.ఎస్‌లో మెగా పవర్‌స్టార్ సంద‌డి
Advertisement

Ram Charan:గుడ్ మార్నింగ్ హైదరాబాద్…
మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో సాంగ్!
గుడ్ మార్నింగ్ అమెరికా…
సాంగ్ కాదు గానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నోటి నుంచి ఈ డైలాగు వస్తే?
వస్తే ఏంటి…?? రాబోతోంది… అది మరికొన్ని గంటల్లో!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు అమెరికాకు చేరింది. ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ రోజు (ఫిబ్రవరి 22న) ప్రసారం కానున్న టీవీ షోలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు.

Advertisement

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం భారతీయ కథానాయకులలో ఈ ఘనత అందుకున్నది కూడా ఆయనే.

అమెరికాలో మధ్యాహ్నం ఒంటి గంటకు, మన భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ‘గుడ్ మార్నింగ్ అమెరికా – రామ్ చరణ్’ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్, తర్వాత సంగతులతో పాటు కొత్త సినిమాల గురించి రామ్ చరణ్ షోలో మాట్లాడనున్నారు.  

Advertisement

ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళారు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రోగ్రాంలో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ప్రజెంటర్ గా అవార్డ్ ఇవ్వనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రోగ్రాంలో రామ్ చరణ్ కు అమెరికన్ ఆడియన్స్ నుంచి హ్యుజ్ రెస్పాన్స్ లభించింది. ఇండియన్, గ్లోబల్ ఫ్యాన్స్ ఆయన్ను మీట్ కావడం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్

Ram Charan: గుడ్ మార్నింగ్ అమెరికా షోకు చీఫ్ గెస్టుగా రామ్ చరణ్..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×