BigTV English
Advertisement

New Electric Scooty:మార్కెట్లోకి మరో 2 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు

New Electric Scooty:మార్కెట్లోకి మరో 2 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు

New Electric Scooty:ఇండియా ఈవీ మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు కంపెనీలు 2 టూ వీలర్లను లాంచ్ చేశాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘రివర్’… తన ‘ఇండీ’ ఎలక్ట్రిక్ టూవీలర్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.25 లక్షలు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన రివర్… ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ఇండీని డెలివరీ చేస్తామంటోంది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఒకాయా… ఫాస్ట్ F2F పేరుతో రూ.83,999కి కొత్త మోడల్‌ను విడుదల చేసింది.


ఇండీలో 4 కిలోవాట్ల బ్యాటరీ అమర్చింది… రివర్ కంపెనీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతోంది. హై స్పీడ్ మోడ్‌లో కూడా 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని తెలిపింది. ఇండీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందని, ఇంట్లో అయితే 5 గంటల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని చెబుతోంది.
ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయని, ఇది 3.9 సెకన్లలోనే 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్‌ అబ్జార్బర్స్… లో మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ టెయిల్‌లైట్, కాంట్రాస్ట్ డిస్‌ప్లే, లగేజ్ మోయడానికి పన్నీర్ మౌంట్స్, 12 లీటర్ల గ్లోవ్ బాక్స్, 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. మాన్‌సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో రంగుల్లో అందుబాటులో ఉంది… ఇండీ. బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది… రివర్ కంపెనీ.

ఇక ఒకాయా ఫాస్ట్ F2Fలో 2.2 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. ఎకో, సిటీ, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్ ఉన్న ఈ టూవీలర్ ద్వారా ఒక ఫుల్ ఛార్జ్‌కు 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే దీని గరిష్ట వేగం మాత్రం 50 నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే. నాలుగైదు గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీపై రెండేళ్లు లేదా 20 వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది… ఒకాయా. ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ అండ్ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, రిమోట్ కీ… ఫాస్ట్ F2F ప్రత్యేకతలు, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్… ఇలా ఆరు రంగుల్లో ఈ టూవీలర్ అందుబాటులో ఉంది.


Edition Bikes:బీఎండబ్ల్యు బైక్స్.. వందేళ్ల లిమిటెడ్ ఎడిషన్ విడుదల..

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×