E-Paper
Advertisement

Ram Charan: RC 15…ఇంగ్లీష్ టైటిల్ పెడుతున్న శంక‌ర్‌

Ram Charan: RC 15…ఇంగ్లీష్ టైటిల్ పెడుతున్న శంక‌ర్‌
Advertisement
Ram Charan:

Ram Charan : మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 70 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ నెల‌లోనే కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీల‌పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా శంక‌ర్ ఏం చేస్తారోన‌ని మెగా ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డేకి ఓ రోజు ముందు అంటే మార్చి 26న శంక‌ర్ ఒక‌టి కాదు.. ఏకంగా రెండు స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తార‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. RC 15 టైటిల్ లుక్‌, గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. దీంతో చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ ఎలాంటి టైటిల్‌ను పెడ‌తార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో చాలా ర‌కాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే విశ్వంభ‌ర‌, అధికారి అనే టైటిల్స్ ప్ర‌ముఖంగా వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడు మ‌రో టైటిల్ లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది.

Advertisement

RC 15 పాన్ ఇండియా సినిమా కావ‌టంతో అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఓ టైటిల్‌ను పెడితే స‌రిపోతుంద‌ని శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. అందుక‌ని ఈ చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టాల‌నుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే స‌రిపోతుంది. C.E.O అంటే చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ అని అర్థం. ప‌ర్టికుల‌ర్‌గా దీన్నే టైటిల్‌గా పెట్ట‌డానికి కార‌ణం.. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని నాలుగు వంద‌ల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి భారీ బ‌డ్జెట్‌తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నేది ప్ర‌స్తుతం నిర్మాత‌ల ప్లాన్‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×