BigTV English

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి షాక్.. బిగ్‌బాస్ ఫేమ్‌ అర్చనాను వేధించిన కేసులో..

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి షాక్.. బిగ్‌బాస్ ఫేమ్‌ అర్చనాను వేధించిన కేసులో..

Priyanka Gandhi: కామాంధులు ఎక్కడైనా, ఏ రూపంలోనైనా ఉంటారు. ఆడది కనిపిస్తే చాలు వేధిస్తుంటారు. ప్రేమ పేరుతో ఒకడు.. పెళ్లి పేరుతో ఇంకోడు.. అవకాశాలు ఇప్పిస్తానంటూ మరొకడు. ముందు నైస్‌గా ట్రాప్ చేస్తారు. తర్వాత అసలు బుద్ధి బయటపెడతారు. లేటెస్ట్‌గా కాంగ్రెస్‌ ప్లీనరీలో జరిగిన ఓ ఘటన.. పార్టీలో కలకలం రేపుతోంది. ఏకంగా ప్రియాంక గాంధీ పీకేపైనే కేసు నమోదవడంతో కేడర్ ఉలిక్కిపడుతోంది.


ఆమె పేరు అర్చనా గౌతమ్. మోడల్, నటి కూడా. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేరఠ్ ప్రాంతంలో మంచి పట్టున్న దళిత నేతగా ఎదిగారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కాంగ్రెస్ లీడరే కావడంతో.. ఆమెను ప్రియాక గాంధీ దగ్గర పీఏగా చేస్తున్న సందీప్ సింగ్ మెళ్లిగా లైన్లో పెట్టాడు. ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారంటూ.. రాయ్‌పుర్‌లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్‌ సింగ్‌ చెప్పాడు. నిజమే అనుకొని అక్కడికి వెళ్లిన అర్చనతో.. సందీప్‌ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగకపోతే చంపుతానని బెదిరించాడు.. అంటూ మేరఠ్‌ పోలీసులకు అర్చనా తండ్రి గౌతమ్‌ బుద్ధా ఫిర్యాదు చేశాడు. సందీప్ బెదిరింపులపై అర్చన కూడా ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పెట్టింది.


కేసు నమోదు చేసుకున్న మీరఠ్ పోలీసులు.. ప్రియాంకగాంధీ పీకే సందీప్ సింగ్‌పై పలు సెక్షన్లలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రియాంక గాంధీ పీఏ కావడంతో ఈ పరిణామం కాంగ్రెస్‌లో కల్లోలంగా మారింది.

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×