E-Paper
Advertisement

Ram Charan:- ‘ఏంట‌మ్మా..’ నుంచి బీటీఎస్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

Ram Charan:- ‘ఏంట‌మ్మా..’ నుంచి బీటీఎస్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
Advertisement

Ram Charan:- గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున్న మెరిసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఏంట‌మ్మా అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌లతో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డాన్స్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియో ( స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో ఏం జ‌రిగింద‌నే తెలియ‌జేసే వీడియో)ను గురువారం (ఏప్రిల్ 6)న రిలీజ్ చేశారు. జాతీయ స్థాయిలో తుఫానులా ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిన పాట గురించి మ‌న RRR స్టార్ మ‌న‌సులో మాట‌ను తెలియ‌జేశారు. ఏంట‌మ్మా సాంగ్‌ను చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామ‌ని అన్నారు మ‌న పాన్ ఇండియా స్టార్‌.

Advertisement

ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి తాను ఏంటమ్మా సాంగ్‌లో న‌టించటం క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెబుతూ , ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా ఉంటుంద‌ని అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఈ పాట‌లో క‌నిపించ‌ని ఎన‌ర్జీతో చాలా పాపుల‌ర్ అయ్యింది.

ఏంట‌మ్మా సాంగ్‌కు పాయ‌ల్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హించగా విశాల్ డ‌డ్లాని, పాయల్ దేవ్, ర‌ఫ్లార్ ఆల‌పించారు. ష‌బీర్ అహ్మ‌ద్ సాహిత్యాన్ని అందించగా జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది.

Advertisement

LINK – https://youtu.be/w0ECti8sCp8?t=146

for more updates follow this link:-Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×