Vishwak Sen:- యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయటం విశేషం. ఆసక్తికరమైన విషయమేమంటే.. విశ్వక్ డబుల్ రోల్ చేస్తూనే సినిమాను డైరెక్ట్ చేస్తూ తండ్రితో కలిసి నిర్మించాడు. ఈ సినిమా తనకు కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ మాధ్యమంలో ఆడియెన్స్‌ను అలరించనుంది. ఇంతకీ దాస్ కా ధమ్కీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా.. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో. ఏప్రిల్ 14న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి సంజయ్ రుద్ర. పుట్టిన తర్వాత అనాథగా మారి చాలా కష్టపడి పెరిగి పెద్దైన మరో వ్యక్తి కృష్ణదాస్..మధ్య జరిగే పోరాటమే దాస్ కా ధమ్కీ. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ఇద్దరూ ఒకేలా ఉండటం. విశ్వక్ సేన్, హైపర్ ఆది, మహేష్‌ల నటనతో ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అసలు వీరి మధ్య గొడవేంటి? ధనవంతుడు సంఘంలో పేరున్న సంజయ్ రుద్ర ఉన్నట్లుండి కృష్ణదాస్‌ను ట్రాప్ చేయాలనకున్న విషయాలు, కథలో ఉండే ట్విస్టులు, టర్నులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. అలాంటి మూమెంట్స్‌తో ఆడియెన్స్‌కి అందించటానికి సిద్ధమైంది ఆహా.
ఫలక్ నుమాదాస్ సినిమా తర్వాత విశ్వక్ హీరోగా నటిస్తూ రూపొందించిన చిత్రమే దాస్ కా ధమ్కీ. తన గత చిత్రాల కంటే ఎక్కువ బడ్జెట్‌తోనే దాస్ కా ధమ్కీ చిత్రాన్ని నిర్మించారు. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ఈ సినిమా ఎండింగ్‌లో చెప్పారు మేకర్స్.
వార్ 2తో ఎన్టీఆర్ సెన్సేషన్.. ఆ క్లబ్‌లోకి యంగ్ టైగర్
for more updates follow this link:-Bigtv