E-Paper
Advertisement

Ram Charan: అంబానీ ఇంట పెళ్ళికి బయల్దేరిన మిస్టర్. సి దంపతులు..

Ram Charan: అంబానీ ఇంట పెళ్ళికి బయల్దేరిన మిస్టర్. సి దంపతులు..
Advertisement

Ram charan Upasana news(Tollywood news in telugu): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ను ఫినిష్ చేసి రిలాక్స్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ రిలాక్స్ మోడ్ ను క్లింకారతో టైమ్ గడపడానికి ఉపయోగిస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. నేడు రామ్ చరణ్ దంపతులు ముంబైకి పయనమయ్యారు. ప్ర‌స్తుతం ముంబై జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో జ‌రుగుతున్న అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ ల వివాహం జరుగుతున్న విషయం తెల్సిందే.

జూలై మొదటి వారం నుంచే ఈ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సంగీత్, హల్దీ, పూజ అంటూ రోజుకో పండగ జరుగుతుంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు ఇప్పటికే పెళ్లిలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ జంట వివాహానికి హాజరుకావడానికి చరణ్ దంపతులు ముంబైకి బయల్దేరారు. నేటి ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చరణ్, ఉపాసన, క్లింకార కెమెరా కంటికి చిక్కారు.

Advertisement

ఇక అంబానీ పెళ్ళికి వెళ్తున్న ఏకైక తెలుగు హీరో చరణ్ మాత్రమే కావడం విశేషం. అనంత్- రాధికా ఎంగేజ్ మెంట్ లో కూడా చరణ్ మెరిశాడు. మెరవడం మాత్రమే కాదు హైలైట్ గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్ సాంగ్ కు నీతూ అంబానీ స్టేజిమీదకు పిలిచి మరీ స్టెప్పులు వేయించింది. ఇక పెళ్ళిలో కూడా చరణ్ హడావిడి అలానే ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్, ఉపాసన ఎయిర్ పోర్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చరణ్.. త్వరలోనే RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. మరి ఈ సినిమా లతో చరణ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×