E-Paper
Advertisement

Ram charan : లండన్ లో వ్యాక్స్ స్టాట్యూ తో రామ్ చరణ్.. ఏ హీరోకు దక్కని రికార్డు..

Ram charan : లండన్ లో వ్యాక్స్ స్టాట్యూ  తో రామ్ చరణ్.. ఏ హీరోకు దక్కని రికార్డు..
Advertisement

Ram charan : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. ఈ ఏడాది గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా స్టోరీ యావరేజ్ గా ఉండడంతో సినిమా టాకు కూడా యావరేజ్ గానే మారింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించిన తొలి తెలుగు కథానాయకుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు.. ఆ విగ్రహం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వ్యాక్స్ స్టాట్యూ తో రామ్ చరణ్.. 

Advertisement

రామ్ చరణ్ కథలో మరో అరుదైన రికార్డు నమోదయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని గౌరవం ఈయనకు దక్కింది. అయితే ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రామ్ చరణ్ పెట్ లవర్అన్న విషయం తెలిసిందే. ఆయన ఇంట్లో ఎన్నో మూగజీవాలు ఉన్నాయి. అందులో తనకి ఎంత ఇష్టమేనా కుక్కపిల్ల రైమ్ కూడా ఉంది. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా రైమ్ కూడా అక్కడే ఉంటుంది. ఈ మైనపు విగ్రహంలో ఆయన ప్రియమైన రైమ్ కు కూడా చోటు దక్కింది. మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రైమ్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఒక లుక్ వేసుకోండి.

గతంలో చాలా మంది హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ ట్యూస్సాడ్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఆ లిస్టులోకి రామ్ చరణ్ కూడా చేరిపోయారు. రామ్ చరణ్ స్టాట్యూ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసినా రామ్ చరణ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రైమ్ రామ్ చరణ్ ని చూసి తెగ మురిసిపోతున్నారు. రామ్ చరణ్ కు ఈ విగ్రహము ఆవిష్కరణ తో మరో రికార్డు తన ఖాతాలో పడిపోయింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఈయన ఇలాంటి కార్యక్రమాలకి వెళ్లడం తో అక్కడ అభిమానులు కూడా రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగ బడ్డారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ తో సుకుమార్తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×