OTT Movie : ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. థియేటర్ లతో సంబంధం లేని ఈ వెబ్ సిరీస్ లను, ప్రేక్షకులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వీటిలో సూపర్‌నాచురల్ హారర్ సిరీస్ లు, క్రేజీ స్టోరీలతో కేక పెట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ అతీంద్రియ శక్తులను, సూపర్‌నాచురల్ పవర్స్ ను పరిశోధించే ఒక టీమ్ చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
క్రిస్టెన్ బౌచర్డ్ అనే సైకాలజిస్ట్ కాథలిక్ చర్చి తరపున డేవిడ్ అకోస్టా, బెన్ షాకిర్ తో కలసి పనిచేస్తుంది. వీళ్ళు మిరాకిల్స్, డెమోనిక్ పొసెషన్స్, ఇతర అసాధారణ సంఘటనలను విచారిస్తుంటారు. విచారించిన తరువాత వాటికి సైంటిఫిక్ వివరణ ఉందా, లేక నిజంగా సూపర్‌నాచురల్ శక్తులు పనిచేస్తున్నాయా అని నిర్ధారిస్తారు. క్రిస్టెన్ బౌచర్డ్ కు నలుగురు కుమార్తెలు ఉంటారు. ఈమె చర్చి కేసులను సైంటిఫిక్ కోణంలో పరిశీలిస్తుంటుంది. డేవిడ్ అకోస్టా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి. బెన్ షాకిర్ సైన్స్ ను నమ్ముతుంటాడు. వీళ్ళు ముగ్గురూ ఒక టీం గా కేసులను డీల్ చేస్తుంటారు. మరోవైపు లేలాండ్ అనే సైకోపాథ్, సిరీస్‌లో ప్రధాన విలన్‌గా ఈ టీం కు సమస్యలు తెచ్చి పెడుతుంటాడు.
సీజన్ 1: ఈ టీమ్ సీరియల్ కిల్లర్స్ తో పాటు, వివిధ కేసులను విచారిస్తుంది. లేలాండ్ కేసు విచారణలో మాత్రం అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. క్రిస్టెన్ కుటుంబం కూడా అతని సైకో చర్యలతో ఇబ్బందిపడుతుంది.
సీజన్ 2: కొన్ని కేసులు వీళ్ళకు మరింత తలనొప్పులు తెచ్చిపెడతాయి. క్రిస్టెన్ ఆమె తల్లి షెరిల్ గురించి కొన్ని రహస్యాలను కనిపెడుతుంది.
సీజన్ 3: సిస్టర్ ఆండ్రియాకి డెమోన్స్‌ను చూడగలిగే శక్తి ఉంటుంది. ఈ టీమ్‌కి ఆమె తన వంతు సహాయం చేస్తుంది. ఈ సమయంలో క్రిస్టెన్ వ్యక్తిగత జీవితం మరింత అస్తవ్యస్తమవుతుంది.
సీజన్ 4: చివరి సీజన్ లో టీమ్ అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంది. లేలాండ్ ఆరాచకాలకు ముగింపుతో ఈ సిరీస్ ముగుస్తుంది.
Read Also : ప్రేమికుల మధ్య రిజర్వేషన్ చిచ్చు… ఐఏఎస్ కలలను పక్కన పెట్టి రాజకీయ గందరగోళంలో కొట్టుకుపోయే అమాయకుడు
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ వెబ్ సిరీస్ పేరు ‘ఈవిల్’ (Evil). రాబర్ట్, మిషెల్ కింగ్ ఈ సిరీస్ ను రూపొందించారు. 2019 నుంచి 2024 వరకు ఈ సిరీస్ ప్రసారం అయింది. ఈ సిరీస్ సైన్స్, రెలిజియన్ మధ్య వున్న వ్యత్యాసాన్ని పరిశోధిస్తుంది. చెడుకు కారణమయ్యే శక్తులను, ఒక టీం నివారించడానికి ప్రయత్నిస్తుంది. నాలుగు సీజన్‌లతో ఈ సిరీస్ ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ సిరీస్ స్టోరీ క్రిస్టెన్ బౌచర్డ్ అనే ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ జియో సినిమా (Jio Cinema), నెట్ ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.