E-Paper
Advertisement

Ram Charan Became Doctor: రామ్ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ.. కారణం ఇదే..!

Ram Charan Became Doctor: రామ్ చరణ్‌కు డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ.. కారణం ఇదే..!
Advertisement

Actor Ram Charan Became Doctor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరుత సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. అయితే ఫస్ట్ మూవీతోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. తన ఫేస్‌ గురించి ఎంతోమంది ట్రోల్స్ చేశారు. అయినా అవేమి పట్టించుకోకుండా సినిమాలు చేశాడు. మగధీరతో ఆ విమర్శలకు, ట్రోల్స్‌కు పుల్‌స్టాప్ పెట్టాడు.

ఇక అక్కడ నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రపంచ స్థాయిలో తన పేరు గుర్తుండిపోయే విధంగా చేశాడు. అది మెగా పవర్. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు రీజనల్ హీరోగా ఉన్న చరణ్.. ఈ సినిమా తర్వాత గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సాయం చేయడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటాడు.

Advertisement

అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ నటుడికి అరుదైన గౌరవం దక్కింది. ఓ ప్రముఖ యూనివర్సిటీ రామ్ చరణ్‌కి డాక్టరేట్ ప్రకటించింది. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్‌కు గౌవర డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. సినీ ఇండస్ట్రీతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు డేట్ ఫిక్స్.. నామినేషన్స్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

Advertisement

ఈ నెల (ఏప్రిల్) 13న సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని వేల్స్ క్యాంపస్‌లో జరగనున్న యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. అయితే స్నాతకోత్సవంలో చరణ్‌తో పాటు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి. వీరముత్తువేల్ కూడా ఈ డాక్టరేట్ అందుకోనున్నారు. వీరితోపాటు త్రివిట్రన్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జీఎస్‌కే వేలు, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ పద్మశ్రీ శరత్‌ కుమల్‌ అచంటలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. భారీ అంచనాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తర్వాలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సానాతో మరో సినిమా పట్టాలెక్కించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి సగం షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తయిన తర్వాత సుకుమార్‌తో మరో సినిమా చేయనున్నాడు. దీనిబట్టి చూస్తే చరణ్‌ లైనప్‌లో చాలా సినిమాలే ఉన్నాయని చెప్పాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×