BigTV English

Oscars 2025: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు డేట్ ఫిక్స్.. నామినేషన్స్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే..?

Oscars 2025: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు డేట్ ఫిక్స్.. నామినేషన్స్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే..?

Oscars 2025: ప్రతి ఒక్క సినీ పరిశ్రమ ఆస్కార్ సాధించాలని ఎన్నో కలలు కంటుంది. లైఫ్‌లో ఒక్కసారి అయినా ఈ ఆస్కార్ అవార్డు సాధిస్తే చాలు అని అనుకుంటుంటారు కొందరు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందువల్లనే దీని కోసం ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. ఇటీవలే మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల్లో ఓపెన్‌హైమర్ సినిమా ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అయింది. అందులో 7 విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ దర్శకుడు, బెస్ట్ పిక్చర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ వంటి విభాగాల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు లభించాయి. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రం కూడా ఓపెన్‌హైమరే కావడం గమనార్హం.

అయితే ఈ 96వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తయి నెల రోజులు మాత్రమే అవుతుంది. ఇంతలోనే 97వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించిన అప్డేట్‌ను ఆస్కార్ అకాడమీ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ ఏడాది నవంబర్ 17న ఆస్కార్ గవర్నర్స్ అవార్డుల విజేతల ప్రకటన ఉండబోతుంది. డిసెంబర్ 17న ఆస్కార్‌కు సినిమాల షార్ట్‌లిస్ట్ జాబితాను వెల్లడిస్తారు.


Also Read: అన్న చరణ్ ను గుర్తుచేస్తున్న అకీరా.. సేమ్ టూ సేమ్

2025 జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 8తో ఫైనల్ ఓటింగ్ సమయం ముగుస్తుంది. వీటన్నింటి తర్వాత 2025 మార్చి 25న 97వ ఆస్కార్ అవార్డుల వేడుక జరపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్లలో నిర్వహించనున్నారు. మరి ఈ సారి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఏ సినిమాలు కైవసం చేసుకోనున్నాయో చూడాలి.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×