BigTV English

CM Revanth Reddy – Game Changer : రియల్ హీరో.. రీల్ హీరో.. కాన్సెప్ట్ సేమ్ టు సేమ్..

CM Revanth Reddy – Game Changer : రియల్ హీరో.. రీల్ హీరో.. కాన్సెప్ట్ సేమ్ టు సేమ్..

CM Revanth Reddy – Game Changer : టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘.. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో కనిపించాడు.. ఆ మూవీ హిట్ అవ్వలేదు. భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు స్టోరీ ఏదొక రకంగా లీక్ అవుతుంది. దాంతో ఇప్పుడు సినిమాలో హైలెట్ అంశాన్ని పెట్టి అందరిలో ఆసక్తిని కలిగించాలని శంకర్ అనుకున్నారట. అనుకున్నట్లుగానే అదిరిపోయేలా స్టోరీని క్రియేట్ చేశారని టాక్.. అదే తెలంగాణ లో జరుగుతున్న హైడ్రా ఆపరేషన్.. తెలంగాణ సీఏం కాన్సెఫ్ట్ ను ఫాలో అవుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో నిజమేంతుందో ఓ లుక్ వేద్దాం..


గేమ్ ఛేంజర్ మూవీలో హైడ్రా .. 

రామ్ చరణ్, కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ యాక్షన్స్, పొలిటికల్ డ్రామా మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి మొదటి నుంచి స్టోరీ లీక్ అవుతూ వస్తుంది. షూటింగ్ సన్నివేశాలు కూడా లీక్ అయ్యాయి. అందుకే శంకర్ కొత్తగా మూవీని ప్లాన్ చేశారని టాక్.. తెలంగాణ ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ అయిన హైడ్రా సిచ్యువేషన్ ను వాడుకున్నాడని ఇండస్ట్రీలో టాక్.. రామ్ చరణ్ సినిమాలు అంటే ఏదొక మెసేజ్ ఇస్తాయి అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా శంకర్ ట్రేండింగ్ టాపిక్ ను వాడుతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా పేరు సంచలనంగా మారింది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు..


చెరువులను కాపాడేందుకు పెద్ద రామ్ చరణ్ పోరాటం.. 

ప్రకృతి వనరులను కాపాడాలని పొలిటిషియన్ రామ్ చరణ్ అనుకుంటాడు. కొన్ని కారణాల వల్ల ఆయన కోరిక తీరకుండా పోతుంది. కానీ కొడుకు రామ్ చరణ్ మాత్రం ఐఎఎస్ అయిన రామ్ చరణ్ తీరుస్తాడు. యాక్టర్ కృష్ణుడు చెరువుకు దగ్గరలో ఒక ఇంటిని నిర్మిస్తాడు. దాన్ని ఐఎఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ కూల్చివేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి సినిమాలో చూపిస్తారని తెలుస్తుంది.. ఈ కాన్సెప్ట్ సినిమాకు హైలెట్ అవ్వనుందని టాక్…

రేవంత్ రెడ్డి కాన్సెఫ్ట్ పై ప్రశంసలు.. 

తెలంగాణ ముఖ్య మంత్రి చెరువుల అక్రమణ పై చర్యలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం భాగ్యనగరంలో గత కొద్ది రోజులుగా హైడ్రా వేడి తగులుతుంది. చెరువులను అక్రమంగా తొలగించి కట్టడాలు కట్టినవారికి ప్రభుత్వం షాకిస్తుంది. వారి నిర్మాణలను కూల్చివేస్తున్నారు. అయితే చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కాన్సెఫ్ట్ పై తెలంగాణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్న కూడా ఎక్కువ శాతం మంది సీఏం ఆలోచనను సమర్దిస్తున్నారు. ఇదే కాన్సెఫ్ట్ ను రామ్ చరణ్ సినిమాలో చూపిస్తున్నారని తెలుస్తుంది. పొలిటిషియన్ గా ఉన్న రామ్ చరణ్ ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే అతని హయాంలో ఆ పని పూర్తి అవ్వలేదు. ఆయన కొడుకు రామ్ చరణ్ తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తారని తెలుస్తుంది. మరి ఈ మూవీలో ఈ కాన్సెప్ట్ ను ఎలా చూపించారన్నది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×