BigTV English

TTD Update: వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు.. అంతా ఆన్‌లైన్ 

TTD Update: వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు.. అంతా ఆన్‌లైన్ 

TTD Update: తిరుమల తిరుపతి దేవస్థానం రూటు మార్చింది. ప్రతీ దానికీ జవాబుదారీ తనం ఉంచేలా ప్లాన్ చేస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే అన్ని విభాగాలకు టెక్నాలజీ ఎడాప్ట్ చేస్తోంది. విరాళాలు సైతం నేరుగా స్వామివారికి చేరుకునేలా కొత్త పద్దతి ప్రవేశపెట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే వారంలో వాటిని తెలుగు రాష్ట్రాలకు విస్తరించనుంది. ఇంతకీ ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేద్దాం.


తిరుమల కొండలు నిత్యం గోవింద.. గోవిందా నామస్మరణతో మార్మోగుతాయి. స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దూరమైనా తిరుమల వచ్చి స్వామిని ప్రత్యేకంగా దర్శించుకోవడం కొందరు భక్తులు. కొందరైతే తమ మొక్కులు చెల్లించుకుంటారు. మొక్కలు చెల్లించుకోలేని భక్తులు ఆవేదన పడిన సందర్భాలు లేకపోలేదు. వీటిని పరిష్కరించే పనిలో పడింది టీటీడీ. సింపుల్‌గా చెప్పాలంటే భక్తుడి వద్దకే సేవలన్నమాట.

భక్తులు అన్నదాన విరాళాలు ఇచ్చేందుకు కొత్తగా కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో అందిన రూ.55 లక్షలు విరాళాలు వచ్చాయి. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించారు.


తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో డొనేషన్ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మూడు ఆలయాల్లో కియోస్క్ మిషన్ల ద్వారా 15 రోజుల్లో అందిన రూ.5 లక్షలు విరాళాలు వచ్చాయి.

ALSO READ:  ఏంటీ.. ఆ టీడీపీ మంత్రి బొత్స కాళ్లపై పడ్డారా..? వాస్తవం ఏంటి?

మరో వారం రోజుల్లో ఈ సేవలను తెలుగు రాష్ట్రాలకు విస్తరించాలని ఆలోచన చేస్తోంది. వాటిలో విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉంది.

భక్తులు రూ.1 నుండి రూ. లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం ఉంది. పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కియోస్క్ మిషన్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్నిసేవలకు ఆయా మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×