BigTV English

Ram Gopal Varma : వర్మ చెబుతున్న నిజం.. ఏంటీ కొత్త వరస

Ram Gopal Varma : వర్మ చెబుతున్న నిజం.. ఏంటీ కొత్త వరస
Ram Gopal Varma

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇన్నాళ్లు సినిమాలు, ఆన్‌లైన్ వెబ్ సైట్ల ద్వారానే సంపాదించాడు వర్మ. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లోకి దిగాడు. జనరల్‌గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలకు వ్యూయర్స్ ఎక్కువ. బేసిగ్గా వర్మ మాటలకు ఫిదా అయ్యే వారు చాలామంది. తిట్టుకునే వాళ్లు సైతం వర్మ ఏం మాట్లాడి ఉంటాడా అనే చూస్తారు. దటీజ్ వర్మ. అందుకే, ఇప్పుడు యూట్యూబ్ బాట పట్టినట్టు కనిపిస్తోంది.


త్వరలోనే నిజం పేరుతో యూట్యూబ్‌ ఛానల్ లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు కూడా. నిజం ఛానల్‌లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా ప్రస్తుత పరిస్థితులు, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, కోర్టులు.. ఇలా చాలా టాపిక్స్ ఉంటాయన్నాడు. 25న సాయంత్రం 4 గంటలకు ‘నిజం’చానల్ లాంఛ్‌ కాబోతుందని ట్వీట్ చేశాడు.

నిజం యూట్యూబ్ చానెల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ట్వీట్స్ లో కొన్ని కోట్స్ కూడా చేశాడు రామ్ గోపాల్ వర్మ. అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి అంటూ స్టార్ట్ చేశాడు. నిజాన్ని ఎవ్వరూ చంపలేరని, కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుందని తన స్టైల్‌లో రాసుకొచ్చాడు.


దేన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే రామ్ గోపాల్ వర్మ.. నిజం ఛానెల్ ద్వారా ఇంకెన్ని సెన్సేషన్స్ చేయబోతున్నాడోనని అభిమానులు, నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ఇకపై వర్మ బయటి వ్యక్తులకు ఇంటర్వ్యూలు ఇవ్వడా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సొంత ఛానెల్ ఉండగా.. వేరే వారికి ఇంటర్వ్యూలు ఇస్తే… వ్యూయర్ షిప్‌కు దెబ్బే. పైగా… నటీనటులు, ప్రభుత్వాలు, కొన్ని ఇన్సిడెంట్స్‌పై వర్మ రియాక్ట్ అవుతుంటాడు. ఇకపై వాటిని యూట్యూబ్‌లోనే ఫస్ట్ రిలీజ్ చేయొచ్చు. 

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×