E-Paper
Advertisement

RAPO22: మహేష్ బాబుతో రామ్ సినిమా.. ఈసారి హిట్ ఖాయమే.. ?

RAPO22: మహేష్ బాబుతో రామ్ సినిమా.. ఈసారి హిట్ ఖాయమే.. ?
Advertisement

RAPO22: ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనికి ప్రస్తుతం ఒక భారీ హిట్ కావాలి. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ హిట్ అందుకున్నది లేదు. బోయపాటి శ్రీను తో స్కంద లాంటి మాస్ యాక్షన్ సినిమా చేసాడు. ఈ సినిమాపై రామ్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు. కానీ స్కంద.. రామ్ కు విజయాన్ని తీసుకురాకపోగా.. భారీ పరాజయాన్ని అందించింది.

ఇక ఈ సినిమా తరువాత తనకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. ఈ సినిమా కోసం రామ్ బాగా కష్టపడ్డాడు. పూరి జగన్నాథ్ ను నమ్మి.. సీక్వెల్ ను త్వరగా ఫినిష్ చేసి ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఇక ఈ సీక్వెల్ కూడా రామ్ ను బోల్తా కొట్టించింది. పార్ట్ 2 కన్నా.. పార్ట్ 1 నే బావుందనే పేరు వచ్చింది.

Advertisement

ఇక ఇలా వరుస పరాజయాలను అందుకుంటున్న.. రామ్ మాత్రం అలుపెరుగని ధీరుడులా హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ .. తన కొత్త సినిమాను పండగ పూట ప్రకటించాడు. ఎప్పటినుంచో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ కుర్ర హీరో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ.. నేడు RAPO22 ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

లేడీ సూపర్ స్టార్ అనుష్క, జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ బాబు పి.. రామ్ తదుపరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక సున్నితమైన అంశాన్ని ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మహేష్ బాబు చూపిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement

ఇప్పుడు కూడా అలాంటి డిఫరెంట్ కథతోనే డైరెక్టర్ రానున్నాడని తెలుస్తోంది. ఈ పోస్టర్ ను రామ్ షేర్ చేస్తూ.. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి ఈ సినిమాతో రామ్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×