BigTV English
Advertisement

Allu Arjun: గొడవపై క్లారిటీ.. మెగావార్ ముగిసినట్టేనా..?

Allu Arjun: గొడవపై క్లారిటీ.. మెగావార్ ముగిసినట్టేనా..?

Allu Arjun.. మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ (Allu Arjun) మెగా అనే ట్యాగ్ ఉపయోగించి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు అనేది వాస్తవం అంటూ మెగా ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. కానీ ఆ ట్యాగ్ ను తొలగించుకోవడానికి అల్లు అర్జున్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఆ ట్యాగ్ నుంచి బయటపడి తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగి నేడు పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఒకరకంగా అల్లు అర్జున్ కెరీర్ కు పునాది వేసింది మెగా ఫ్యామిలీనే అయినా తన సొంత టాలెంట్ తో ఎదిగి నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఇలాంటి మెగా ఫ్యామిలీ తో అల్లు అర్జున్ విభేదాలు పెట్టుకున్నాడు అంటూ గత కొన్ని నెలలు గా వార్తలు వినిపిస్తున్నా..అందులో ఏ ఒక్కరోజు కూడా ఎవరు బయటపడలేదు.


అసలు గొడవ ఎక్కడ మొదలైంది..

అయితే ఈసారి 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ విషయం కాస్త బట్టబయలు అయిందని చెప్పాలి. ముఖ్యంగా తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసిన అల్లు అర్జున్.. మరొకవైపు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కు నేరుగా సపోర్ట్ చేయడం మెగా, జనసేన నాయకులకు, అభిమానులకు నచ్చలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లుఅర్జున్ అభిమానుల మధ్య గొడవలు తారస్థాయికి చేరిపోయాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్నట్టు వ్యవహరించారు. దీనికి తోడు మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఇక ఎక్కడికి వెళ్లినా మెగా వెర్సెస్ అల్లు అంటూ ఎవరికి వారు విమర్శలు గుప్పించారు.


మెగా గొడవలపై అల్లు అర్జున్ క్లారిటీ..

అయితే అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్ స్నేహంగానే ఉన్నా .. ఇటు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మధ్య నిప్పు చెలరేగుతోందనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటికి నేడు అల్లు అర్జున్ చెక్ పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే ఒకవైపు హీరోగా, మరొకవైపు ఎమ్మెల్యేగా మంచి పేరు సొంతం చేసుకున్న బాలయ్య (Balayya ) హోస్ట్గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అన్ స్టాపబుల్ (Unstoppable) షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దసరా పండుగ సందర్భంగా ఈ షో నుంచి నాలుగవ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ నాలుగవ సీజన్లో మొదటి ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు.

మెగావార్ కి పుల్ స్టాప్ పడినట్టేనా..

ఇక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి బాలయ్య.. అల్లు అర్జున్ నుంచి నిజాన్ని బయటకు తెప్పించే ప్రయత్నం చేశారట..అందులో భాగంగానే అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్లారిటీ ఏదో మెగా ఫ్యామిలీకి ఇవ్వలేదు కానీ బాలయ్యకు ఇచ్చారు అని సమాచారం. పవన్ కళ్యాణ్ తో గొడవలలో నిజం ఎంత
.? అసలు ఏం జరిగింది .?మీడియాలో వస్తున్న వార్తలలో నిజం ఎంత..? ఇలా అన్ని విషయాలను బాలకృష్ణ అడగగా అన్నింటిపై కూడా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రసారం కాబోతోంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూలో బన్నీ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారట. మరి అసలు నిజం తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇదే నిజమైతే మెగా వార్ కి ఇక పులిస్టాప్ పడినట్లే అని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×