E-Paper
Advertisement

Ram Pothineni: ఆ సినిమా కోసమే రెండు నెలల్లో 18 కేజీలు తగ్గినా..రామ్ పోతినేని

Ram Pothineni: ఆ సినిమా కోసమే రెండు నెలల్లో 18 కేజీలు తగ్గినా..రామ్ పోతినేని
Advertisement

Ram Pothineni Sensational Comments(Tollywood news in telugu): టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైన్‌మెంట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. అయితే ఈ సినిమా ‘ఇస్మార్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా, ఈ సినిమాపై హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కోసం ఏకంగా రామ్..18 కేజీలు తగ్గినట్లు వెల్లడించాడు.

‘డబుల్ ఇస్మార్ట్ సినిమాలో క్లైమాక్స్ కోసం పూరీ జగన్నాథ్ ఓ విషయం చెప్పాడు. ఈ సీన్ కోసం బరువు తగ్గాలని చెప్పాడు. స్కంద సినిమా సమయంలో నేను 86 కేజీలు ఉన్నా. అయితే డైరెక్టర్ వెయిట్ తగ్గాలని చెప్పడంతో ఏకంగా 18 కేజీలు..కేవలం 2 నెలల్లోనే తగ్గాను. ప్రస్తుతం 68 కేజీలు ఉన్నాను. వెయిట్ తగ్గడానికి ప్రత్యేకంగా బాలి వెళ్లి ట్రైనింగ్ తీసుకుున్నా’. అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై రామ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హీరో డెడికేషన్‌కి హాట్సఫ్ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: సై అంటున్న స్టార్ హీరోలు.. ఒకే రోజు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ప్రభాస్, యష్ సినిమాలు..!

ఇదిలా ఉండగా, 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలోనూ క్లైమాక్స్ హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాలోనూ మళ్లీ అదే లుక్ తో కనిపించేలా మేకర్స్ చేస్తున్నారు. ఇందుకోసమే స్కంద సినిమా పూర్తయిన వెంటనే ఫారన్ వెళ్లి అక్కడే తీవ్రంగా శ్రమించి శంకర్ లుక్ లోకి వచ్చారు. అయితే దీనిపై రామ్ సన్నిహితులు స్పందించారు. రెండు నెలల్లో 18 కేజీలు తగ్గడం మామూలు విషయం కాదు.. దీనికోసం రామ్ రాత్రి సమయాల్లో కేవలం జ్యూస్ మాత్రమే తీసుకునేవాడని చెప్పారు. ఇక, ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×